ఇప్పుడు జగన్ ఆయుధం....టీడీపీ మ్యానిఫెస్టోనే   Jagan Use Tdp Manifesto To Fight Against Chandrababu     2018-01-01   23:58:46  IST  Bhanu C

తెలుగు దేశం పార్టీ మ్యానిఫెస్టో ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కి తంటాలు తెచ్చిపెడుతోంది..ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమి చేస్తామో చెప్పే మ్యానిఫెస్టో ఆధారంగా వైసీపి అధినేత జగన్ ఇప్పుడు బాబుపైనే వాటిని అస్త్రంగా వదులుతున్నారు..ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్రని కొనసాగిస్తున్న జగన్ చేనేత కార్మికులు ,పారిశ్రామిక నేతలతో మాట్లాడారు..ఈ వేదికగానే బాబు పై విమర్శలు చేశారు..

టిడిపి మ్యానిఫెస్టో తీసి ప్రజలకి చూపిస్తూ బాబు తన మ్యానిఫెస్టోలో ఏమి చెప్పాడో తెలుసా చదువుతాను వినండి అంటూ.. మగ్గం మీద కూర్చుని చేనేత కార్మికులతో మమేకం అంటూ ఇలా ఫోజు పెడుతాడు..చేనేత కార్మికుల కంటే తానె ఎక్కువగా కష్టపడిపోతున్నట్టుగా కనిపిస్తాడు..కానీ ఈ నాలుగు సంవత్సరాలలో కనీసం ఒక్క హామీ అయినా జరిగిందా అని అడిగారు..బ్యాంక్ రుణాలు పవర్ లూం పై ఉన్న ఋణాలు ఏమి చేశావ్ బాబు అంటూ విమర్శించారు.

ఒక్కొక్క చేనేత కుటుంబానికి తక్కువ వడ్డీకి రూ.లక్ష సంస్థాగత రుణం ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ రుణం ఇచ్చారా? చేనేత కార్మికులకు రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తానన్నారు. బడ్జెట్‌లో ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తానన్నారు. ఇవెక్కడైనా కనిపించాయా? జిల్లాకొక చేనేత పార్కు ఏర్పాటు చేస్తానన్నారు. మీ జిల్లాలో ఎక్కడైనా చేనేత పార్కు కనిపించిందా..అంటూ విమర్శలు చేశారు..

ఇదిలా ఉంటే గౌడ కులానికి చెందిన మన సోదరులు ఎక్కడ కనిపించినా సరే అక్కడ వెంటనే ఆగిపోయి వారు వాడే పరికరాలు బుజాన పెట్టుకుని ఫొటోలకి ఫోజులు ఇస్తాడు..వారిని దగ్గర చేర్చుకుని భుజంపై చెయ్ వేసి వారిపై ఎంతో ప్రేమ ఉన్న వాడిలా నటిస్తాడు..రోడ్డుపై బుట్టలు అల్లుకునే వారి వద్దకు చేరిపోతాడు..వారి చేతిలో నుంచీ బలవంతంగా వాటిని లాక్కుని ఈయనే అల్లుతున్నట్టుగా ఫోజులు పెడుతాడు..ఫొటోలకి ఫోజులు కొడుతూ ప్రజలని మభ్యపెట్టే పనులు చేస్తున్నాడు తప్ప మీకు ఇప్పటి వరకూ ఒక్క ప్రయోజనం అయినా జరిగిందా అంటూ చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు..జగన్