జగన్ అప్డేట్స్: ఏ నిమిషంలో ఏం జరిగింది ..?  

Jagan Updates What\'s In The Minute-

వైసీపీ అధినేత జగన్ పై నిన్న జరిగిన దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయం దగ్గర నుంచి హాస్పిటల్ కి చేరే సమయం వరకు ప్రతి నిమిషం ఏమి జరిగిందో చూద్దాం… !

Jagan Updates What's In The Minute-

Jagan Updates What's In The Minute

గురువారం ఉదయం… 11.00: శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా విజయనగరం జిల్లాలో పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్‌. 12.00: హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరిక. 12.20: ఎయిర్‌ పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లో వెయిటింగ్‌. 12.30: జగన్‌కు టీ ఇచ్చిన వెయిటర్‌ శ్రీనివాసరావు. 12.40: జగన్‌ను పలకరించి… ఆయనతో సెల్ఫీ దిగిన శ్రీనివాసరావు. 12.42: అనూహ్యంగా కత్తితో జగన్‌పై దాడి చేసిన వెయిటర్‌ శ్రీనివాసరావు. వెంటనే అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. 12.45: జగన్‌కు విమానాశ్రయంలోనే ప్రథమ చికిత్స. 1.00: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన జగన్‌. 2.30: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రికి జగన్‌. 2.45: జగన్‌కు చికిత్స ప్రారంభించిన వైద్యులు. 5.00: జగన్‌ క్షేమంగా ఉన్నారని… 9 కుట్లు పడ్డాయని వైద్యుల ప్రకటన.