స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.అయితే చాలా సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే ఈ విషయంలో కొందరు బాలయ్యను విమర్శిస్తే మరి కొందరు బాలయ్యను సమర్థిస్తారు.బాలయ్య ఊరికే ఎవరిపై చెయ్యి చేసుకోరని తనకు కోపం తెప్పించిన వాళ్లపై మాత్రమే చెయ్యి చేసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు.
అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది.తాజాగా రవీంద్రనాథ్ రెడ్డి ఒక వ్యక్తిని కొట్టగా ఆ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం బాలయ్య చేస్తే తప్పు కాదు నేను చేస్తే తప్పా అంటూ సమర్థించుకున్నారు.బాలయ్య అభిమానులను కొట్టిన సమయంలో ఆయనను ఎవరూ తప్పుబట్టలేదని ఆయన కామెంట్లు చేశారు.
తనతో కొట్టించుకున్న వ్యక్తి తన అభిమాని అని రవీంద్రనాథ్ రెడ్డి ఆ వ్యక్తి చేత సాక్ష్యం చెప్పించడం గమనార్హం.

అభిమానంతోనే తాను కొట్టించుకున్నానని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు.ఈ కామెంట్ల గురించి బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తుండగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రానుంది.

సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నా బాలయ్య మాత్రం తన సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.బాలయ్య రెమ్యునరేషన్ కూడా దాదాపుగా డబుల్ అయిందని సమాచారం అందుతోంది.ప్రాజెక్ట్ ల ఎంపికలో బాలయ్య గతంతో పోలిస్తే చాలా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మాస్ యాక్షన్ సినిమాలకు బాలయ్య ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.