బాబు రాజకీయ చాణిక్యం ? జగన్ కు దెబ్బ మామూలుగా లేదుగా ?  

Jagan troubled on three capital issue Chandrababu, TDP, Amaravathi, YSRCP, Jagan, Ap Three Capitals, 2019 Elections, Ap High Court - Telugu 2019 Elections, Amaravathi, Ap High Court, Ap Three Capitals, Chandrababu, Jagan, Tdp, Ysrcp

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేది జగన్ మనస్తత్వం.తాను ఏదైతే అమలు చేయాలని అనుకున్నాడో, దానిని ఖచ్చితంగా అమలు చేసి చూపించి తన సత్తా చాటుకుం టూనే వస్తున్నారు.

TeluguStop.com - Jagan Troubled On Three Capital Issue

అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని అమరావతి ని జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.అమరావతిలో ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే బాబు ఇక్కడ రాజధాని ఏర్పాటు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అభిప్రాయపడిన జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించి అమరావతి, విశాఖ, కర్నూల్ లో రాజధానిని విస్తరించాలని, పరిపాలన రాజధానిగా చేయాలని ఉత్సాహంగా అడుగులు వేశారు.

ఇక్కడే ఆయనకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి.

TeluguStop.com - బాబు రాజకీయ చాణిక్యం జగన్ కు దెబ్బ మామూలుగా లేదుగా -Political-Telugu Tollywood Photo Image

ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధాని కొనసాగించాలంటూ టిడిపి డిమాండ్ చేయడం తో పాటు, ఇప్పటికీ ఆ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతూ ఉంది.

అలాగే విశాఖ కు రాజధాని తరలి వెళ్ళిపోకుండా, గట్టిగానే పోరాటం చేస్తోంది.అసలు 2019 ఎన్నికల ముందు ఎక్కడా వైసీపీ మూడు రాజధానులు ప్రకటన చేయలేదని, ఆ ప్రయత్నం చేసి ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని, బాబు చెబుతున్నారు.

ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుల్లో ఉంది.

కోర్టు తీర్పు వచ్చేవరకు అమరావతి రాజధాని గా కొనసాగుతుంది.ప్రస్తుతం అమరావతి ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

దీనిని మరికొంత కాలం కొనసాగించేందుకు టిడిపి సిద్ధంగానే ఉంది.

ఎన్నికలు వస్తాయనే నమ్మకం బాబు ఎక్కువ పెట్టుకున్నారు.

దీనికి తగ్గట్టుగానే కేంద్రంలో ఆ సంకేతాలు వెలువడుతున్నాయి.దీంతో బాబులో మరింత ధీమా పెరిగిపోతోంది.

ఏదో రకంగా అమరావతి ఉద్యమాన్ని అప్పటివరకు రగిల్చి, మూడు రాజధానులు ఏర్పడకుండా అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారాలు హై కోర్టు పరిధిలో ఉంది.

ఒకవేళ ఇక్కడ వైసిపికి అనుకూలంగా తీర్పు వచ్చినా, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో టిడిపి ఉంది.అంటే రాజధాని వ్యవహారం ముందుకు వెళ్లకుండా, వైసీపీకి క్రెడిట్ రాకుండా టిడిపి పైచేయి సాధించే విధంగా బాబు ఈ రకంగా రాజకీయం చేస్తుండడంతో , అధికారంలో ఉన్నా తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం లో బాబు సక్సెస్ కాలేకపోతున్నారు.

#Chandrababu #Jagan #Amaravathi #AP High Court #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Troubled On Three Capital Issue Related Telugu News,Photos/Pics,Images..