ఆ మంత్రులతో నే అసలు ముప్పు .. జగన్ కు తల నొప్పి ?   

తనకు ప్లస్ అవుతారు అనుకున్న వారే తలనొప్పిగా మారడంతో ఏపీ సీఎం జగన్ కు పెద్ద చిక్కు లే వచ్చి పడుతున్నాయి.సొంత వాళ్లతోనే ఇబ్బందులు ఏర్పడడంతో ఆ ఇబ్బందుల నుంచి ఎలా గటెక్కలి అనేది తెలియక నామ హైరానా పడి పోతున్నారు.

TeluguStop.com - Jagan Troubled On Some Ministers Behaviour

ముఖ్యంగా తాను ఏరికోరి మరీ ఎంపిక చేసిన మంత్రులలో చాలామంది పనితీరు అంతంతమాత్రంగా ఉన్నా జగన్ తన చరిష్మా తో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు.అయితే కొంత మంది మంత్రుల వ్యవహార శైలి కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసలు జగన్ మంత్రి మండలి లో ఉన్న వారిలో చాలామంది కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలే.కేవలం సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు.

TeluguStop.com - ఆ మంత్రులతో నే అసలు ముప్పు .. జగన్ కు తల నొప్పి  -Political-Telugu Tollywood Photo Image

అలాగే మొదటి నుంచి జగన్ వెన్నంటే నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు.కానీ వారిలో చాలామంది పని తీరు అంతంత మాత్రంగా ఉండడం, మరి కొందరు వల్ల ఉపయోగం లేకపోగా, అనవసర తిప్పలు వచ్చి పడడంతో ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇప్పుడు జగన్ సతమతం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు వంటి వాటి వల్ల జగన్ కు వచ్చిన క్రెడిట్ మొత్తం మంత్రుల నోటి దురుసు వ్యాఖ్యలు కారణంగా పోతుంది అనేది జగన్ అభిప్రాయం.మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు చాలామంది బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ,రాజకీయ ప్రత్యర్థులపై అనవసర విమర్శలు చేస్తూ, ప్రజల్లో చులకన అవడం వంటి వ్యవహారాల కారణంగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతోనే జగన్ పూర్తిగా బాధ్యతలన్నీ అధికారులు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా తీర్చుకున్నారు.

ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.కానీ ఆ క్రెడిట్ దక్కకుండా చేసే విషయంలో కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతో జగన్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.వారి వల్ల జగన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న మంత్రులు వల్ల తనకు క్రెడిట్ వస్తుందని, ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని భావించినా, ప్రతిపక్షాలపై విమర్శలు చేసే క్రమంలో దూకుడుగా విమర్శలు చేస్తూ ఉండడంతో, అనవసర గందరగోళం ఏర్పడి ప్రభుత్వానికిక్రెడిట్ రాకపోగా, అనవసర విమర్శలు మూటగట్టుకున్నారు.ప్రజల్లో మంత్రుల వ్యవహారశైలి పైన విమర్శలు వస్తున్నాయి.

ఇవన్నీ జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.

.

#Ysrcp #AP Cm #Party #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Troubled On Some Ministers Behaviour Related Telugu News,Photos/Pics,Images..