చెల్లెమ్మ తోనే జగనన్నకు ముప్పు ? 

జగన్ పరంగా చూస్తే ఆయనకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేదు.మరో మూడేళ్ళ పాటు అధికారంలో ఉంటారు.

 Jagan Troubled On Sharmila Telangana Politics, Ap , Jagan, Kcr, Telangana, T-TeluguStop.com

ఆ తరువాత వైసిపి కి అధికారం దక్కే చాన్స్ ఎక్కువగానే కనిపిస్తోంది.  ఆ రకంగా జగన్ టిడిపిని బలహీనం చేయడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ఇంత వరకు ఇబ్బంది ఏమీ లేకపోయినా,  ఇప్పుడు తెలంగాణలో జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న తరుణంలో,  ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో ఆ వ్యవహారం జగన్ కు కొత్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా మెలుగుతున్నారు.

ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.తెలంగాణ ఏపీకి  సంసంబంధించి అన్ని సమస్యల పైన సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసుకుంటూ,  ఒకరికొకరు రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు.

అయితే జగన్ సోదరి షర్మిల పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం ,  విమర్శలు చేస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో షర్మిల కారణం జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటారనే రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.

Telugu Jagan, Telangana, Trs, Ys Sharmila, Ysrcp-Telugu Political News

 జగన్ వేరు షర్మిల వేరు అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయం నడుస్తున్న, టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ షర్మిల చేస్తున్న విమర్శలు పరోక్షంగా జగన్, కెసిఆర్ మధ్య దూరం పెంచుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇక జగన్ సైతం ఈ వ్యవహారంపై ఆందోళన లోనే ఉన్నారట .అసలు పార్టీతో వైసీపీ కి సంబంధం లేదని,  రెండు వేర్వేరు పార్టీలని వైసిపి కీలక నాయకుల ద్వారా ఇప్పటికే ప్రకటనలు చేయించారు.అలాగే తెలంగాణలో అధికార పార్టీపై షర్మిల చేస్తున్న విమర్శలు ఏపీలో అధికార పార్టీ గా ఉన్న తమ పైన ప్రభావం చూపుతాయని,  అక్కడ ఆమె చేపట్టే డిమాండ్లను హైలెట్ చేస్తూ,  ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు తమను ఇబ్బంది పెడతాయనే టెన్షన్ జగన్ లోనూ కనిపిస్తుంది.

ఇటీవల నిరుద్యోగ సమస్యపై షర్మిల దీక్ష చేపట్టిన వెంటనే, ఏపీలో జగన్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగమేఘాలమీద విడుదల చేసింది.

ఇలా ఏ రకంగా చూసుకున్నా, షర్మిల తెలంగాణ రాజకీయం కేసీఆర్ జగన్ మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా,  రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు జగన్ కు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube