జగన్ తొందర పడ్డారా ? బాబు చేతిలో బుక్కయ్యారుగా ?

చంద్రబాబు రాజకీయ వ్యూహాలు మామూలుగా ఉండవు.40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం కావడంతో, ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి ? తమ ప్రత్యర్థులను ఏ విధంగా ఇరికించాలనే విషయంలో ఆయన ఎప్పుడు అలెర్ట్ గా ఉంటారు.అందుకే అనేక సందర్భాల్లో వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ బాబు చేతిలో అడ్డంగా బుక్కైన పోతూ ఉంటారు.టిడిపి పరిస్థితి రోజురోజుకు ఏపీలో దిగజారిపోతోంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒక విషయంపై రచ్చ చేసి టిడిపి శ్రేణుల్లో ఆనందం నింపడంతో పాటు, ప్రజలలోనూ చర్చ జరిగేలా చేయడంలో బాబు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు.
      గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం పై ఏదో ఒక విషయంపై పార్టీ శ్రేణులతో ఆందోళనలు చేయిస్తూ, ఏపీ ప్రభుత్వానికి క్రెడిట్ పెరగకుండా బాబు అనేక ప్లాన్ లు వేస్తున్నా, అవేమీ వర్క్ ఔట్ కావడం లేదు.టిడిపి శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతుండడంతో బాబు మరింతగా తన వ్యూహాలకు పదును పెట్టి టిడిపి అధికార ప్రతినిధి రంగంలోకి దించినట్టు గా కనిపిస్తున్నారు.

 Jagan Troubled On Chandrababu Political Stragy Jagan, Ap Cm, Ysrcp, Ap, Chandrab-TeluguStop.com

దీంతో బాబు ఇచ్చిన భరోసాతో పట్టాభి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం,  దీనికి నిరసనగా వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయంలో పై దాడులకు దిగడం వంటి ఆహారాలతో ఏపీ వాతావరణం వేడెక్కింది.ఈ ఘటనపై కేంద్రానికి టిడిపి , జనసేన శ్రేణులు లేఖలు రాశాయి.
   

Telugu Ap Cm, Ap Tdp, Chandrababu, Jagan, Pattabi, Pattabi Jagan, Tdp, Telugudes

   రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం క్యాడర్ మొత్తం ఏకమై వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.దీంతో ఒక్కసారిగా టిడిపిలో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది.పట్టాభి చేసిన విమర్శలను వైసిపి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా,  పట్టించుకోకుండా వదిలేస్తే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు.కానీ బాబు వ్యూహం ప్రకారం వైసిపి శ్రేణులను జగన్ రెచ్చగొట్టే విధంగా చేయడం ద్వారా చంద్రబాబు తన వ్యూహాన్ని అమలు చేయడం, సరిగ్గా ఆ వ్యూహంలో జగన్ చిక్కుకోవడంతో ఇప్పుడు వైసీపీ విమర్శల పాలవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube