వైసీపీలో పదవుల సందడి ! నేడే జగన్ ప్రకటన ?

ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గాన్ని జగన్ ప్రకటించారు.ఈ మంత్రివర్గం లో ఎవరూ ఊహించని వారు మంత్రిపదవులు దక్కించుకున్నారు.

 Jagan To Hand Over Nominated Posts To Key Party Leaders Ysrcp, Ap,tdp,jagan, Ap-TeluguStop.com

ఇంకా ఎంతోమంది జగన్ కు అత్యంత సన్నిహితులు , పార్టీ కీలక నాయకులు పదవులను కోల్పోయారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రి పదవులను కట్టబెట్టారు.

ఈ సందర్భంగా ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు .వారిలో కొంతమంది ని జగన్ బుజ్జగించారు.మరెంతో మంది ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు.దీంతో అసంతృప్త నాయకులను బుజ్జగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.ఈ మేరకు నేడు , తుది జాబితాను ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

     2024 ఎన్నికల్లో వైసీపీ మరోసారి గెలిచే విధంగా ఇప్పుడు పదవుల భర్తీ చేపట్టబోతున్నారు .క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకు పదవులు అప్పగించడం ద్వారా, ఎన్నికల్లో సునాయాసంగా గెలవవచ్చు అని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వీరంతా బాధ్యతగా వ్యవహరిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు.ఈ మేరకు కొంతమంది నాయకులకు అప్పగించబోయే పదవుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే … ఇప్పటివరకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను చూసిన విజయసాయిరెడ్డికి ఈసారి పార్టీ కేంద్ర ఆఫీస్ బాధ్యతలు అప్పగించబోతున్నారట.
   

Telugu Ap Cm Jagan, Ap, Ap Ministers, Jagan, Mithun Reddy, Vijayasai, Ysrcp-Telu

  ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ మంత్రి కొడాలి నాని,  బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ ప్లాన్ చేశారట.శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు బొత్స సత్యనారాయణను ఇన్చార్జిగా నియమిస్తారని, తూర్పుగోదావరి జిల్లాకు వై.వి.సుబ్బారెడ్డి పశ్చిమగోదావరి జిల్లాకు ఎంపీ మిథున్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉన్నట్లు సమాచారం అలాగే కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల బాధ్యతలను కొడాలి నానికి, పల్నాడు జిల్లాకు మోపిదేవి వెంకటరమణ,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని , చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప, కర్నూలు జిల్లాలకు కలిపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని పార్టీ ఇన్చార్జిలుగా నిర్మించబోతున్నట్లు సమాచారం.చిత్తూరు అనంతపురం జిల్లాలకు సైతం మంత్రి పెద్దిరెడ్డి బాధ్యతలు అప్పగిస్తారట.ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి జిల్లాల  ప్రత్యేక బాధ్యతలు కేటాయించడం లేదు.

పార్టీ రాష్ట్ర సమన్వయకర్త గానే ఆయనను కొనసాగించాలని జగన్ డిసైడ్ అయ్యారట.ఈ మేరకు ఈ జాబితాలో మార్పుచేర్పులు చేపట్టి ఈ రోజు ఫైనల్ లిస్ట్ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube