కమిటీల పేరుతో జగన్ సంచలనం ? సీటు టెన్షన్ లో ఎమ్మెల్యేలు ?

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా , అది ఆకస్మికంగా తీసుకుంటారు.రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబుల్ పుట్టిస్తూ ఉంటారు.

 Jagan To Appoint Committee On Performance Of Party Mlas-TeluguStop.com

తమను ఎంతగా ఇబ్బంది పెడదామని ప్రతిపక్షాలు ప్రయత్నించినా,  వారెవరికీ అవకాశం దక్కకుండా చేసేందుకు జగన్ ప్రతి దశలోనూ ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇక తన పరిపాలనలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అనేదే జగన్ అభిప్రాయం.

తన పరిపాలన స్వర్ణయుగంగా భవిష్యత్తు తరాలు చెప్పుకోవాలని,  ప్రజలు తన పరిపాలనపై నూటికి నూరు శాతం సంతృప్తితో ఉండాలి అనే విధంగా జగన్ పరిపాలన సాగుతూ ఉంటుంది.సీఎంగా తాను ఎంత కీలకంగా వ్యవహరిస్తూ,  ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంతే స్థాయిలో ప్రజలలో బలం పెంచుకో కపోతే, రానున్న రోజుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని ఎమ్మెల్యేలపై ప్రజలలో  పెరిగిన వ్యతిరేకత కారణంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలుపు పై తప్పనిసరిగా ప్రభావం చూపిస్తోందనే భయం జగన్ లో ఎక్కువ  కనిపిస్తోంది.

 Jagan To Appoint Committee On Performance Of Party Mlas-కమిటీల పేరుతో జగన్ సంచలనం సీటు టెన్షన్ లో ఎమ్మెల్యేలు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే పూర్తిగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పై జగన్ నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకునే పనిలో ఉన్నారు.
  ఇప్పటికే కొంతమంది పనితీరుపై పార్టీ నాయకుల ద్వారా హెచ్చరికలు చేయించారు.

అయినా పరిస్థితి లో  పెద్దగా మార్పు వచ్చినట్లుగా కనిపించకపోవడంతో,  తనకు అత్యంత సన్నిహితులు , పార్టీ సీనియర్ నాయకులతో ఓ ప్రత్యేక కమిటీ నియమించేందుకు జగన్ సిద్ధమవుతున్నారట.ఈ కమిటీ ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తిస్థాయిలో నివేదిక తెప్పించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నివేదిక ద్వారా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడంతో పాటు,  ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి గురించి ఆ కమిటీల ద్వారా  వివరాలు తెప్పించుకోవాలి అని,  అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే, స్వయంగా వారిని పిలిచి వార్నింగ్ ఇవ్వాలని , అయినా, ఎన్నికల నాటికి వారి పనితీరు ఆశాజనకంగా లేకపోతే, వారి స్థానంలో వేరొకరికి ఆ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
  ఈ పరిణామాలు వైసిపి ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తోంది.

Telugu Ap Cm, Ap Government, Ap Politics, Chandrababu, Jagan, Jagan Committee, Jagan Strategies, Mla Seats, Tdp, Ycp Leaders In Tension, Ycp Mlas Performance, Ysrcp, Ysrcp Mlas-Telugu Political News

ఇప్పటికే కరోనా తో పాటు  వివిధ అంశాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నామని, మళ్లీ తమ పనితీరుపై కమిటీలు వేస్తే, ఆ కమిటీలు ఇచ్చే నివేదిక తమకు అనుకూలంగా లేకపోతే రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుందనే టెన్షన్ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలోకొందట.అందుకే ప్రజా వ్యతిరేకత రాకుండా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ జగన్ వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకు ఎమ్మెల్యే లు ప్రయత్నాలు మొదలుపెట్టారట.       

#MLA Seats #Ysrcp #Chandrababu #Jagan Committee #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు