శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుకి కష్టమే! అడ్డు తప్పదు

ఏపీకి మూడు రాజధానులకి సంబందించిన బిల్లుని అసెంబ్లీలో తన బలంతో అధికార పార్టీ ఏకపక్షంగా ఆమోదం లభించేలా చేసుకుంది.ఇక మూడు రాజధానులని త్వరలో అమల్లోకి తీసుకొచ్చి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నాలు అధికార పార్టీ మొదలెట్టింది.

 Jagan Three Capitals In Shashanamandali-TeluguStop.com

ఇక పనిలో పనిగా విశాఖలో భూములని సొంతం చేసుకునే పనిలో వైసీపీ నాయకులు పడ్డట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇదిలా ఉంటే అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకున్న కూడా ఇప్పుడు ప్రభుత్వానికి శాసన మండలి రూపంలో అడ్డంకి ఏర్పడనుంది.

నేడు శాసన సభలో ఈ బిల్లుని ఎలా అయిన ఆమోదించుకోవాలని చూస్తున్న వైసీపీకి టీడీపీ అడ్డుపుల్ల వేయడానికి సిద్ధంగా ఉంది.శాసన మండలిలో అధికార పార్టీ బలం కంటే టీడీపీ బలం ఎక్కువగా ఉంది.

ఈ నేపధ్యంలో ఇక్కడ బిల్లుని అడ్డుకోవడం ద్వారా తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది.

అయితే అధికార వైసీపీ మాత్రం టీడీపీ ఆటలు సాగకుండా పాచికలు వేయాలని చూస్తుంది.

మరో వైపు శాసన మండలిలో టీడీపీ తన బలంతో బిల్లుని అడ్డుకోవడంతో పాటు హైకోర్టుని ఆశ్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఉన్నపళంగా రైతుల అభిప్రాయం తీసుకోకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా పోలీసులని పెట్టి, ఆందోళనలని అణచివేసి బిల్లుని పాస్ చేసుకోవడంపై హైకోర్టుకి ఫిర్యాదు చేసి మూడు రాజధానుల వ్యవహారానికి కాలయాపన జరిగేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

మరో వైపు జనసేన, బీజేపీ కూడా ఈ మూడు రాజధానులని వ్యతిరేకించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉందని తెలుస్తుంది.ఏదో అసెంబ్లీలో తన బలంతో తెలుగు మాధ్యమం తరహాలో బిల్లుని పాస్ చేసుకున్న దీనిని అంత ఈజీగా అమలు చేసే అవకాశం అధికార పార్టీకి లేదనే మాట బలంగా వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube