ప్రత్యేక జోన్ గా అమరావతి ? జగన్ ఆలోచన ఇదేనా ?

రాజధాని వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా అధికార పార్టీ పై ప్రశంసలు, విమర్శలు అదే రేంజ్ లో వ్యక్తం అవుతున్నాయి.జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు అంటూ హడావుడిగా ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.

 Jagan Thinking About Amaravathi In Special Zone-TeluguStop.com

జగన్ నిర్ణయం సరైందే అంటూ కొన్ని ప్రాంతాల వారు సమర్దిస్తుండగా మరికొందరు మాత్రం మేమంతా అమరావతిని రాజధానిగా ఊహించుకున్నామని ఇప్పుడు అక్కడ నుంచి రాజధానిని తరలిస్తే ఎలా అంటూ హడావుడి చేస్తున్నారు.అయితే జగన్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నారు.

ఇప్పటికిప్పుడు రాజధానిని నిర్మించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని, దానికి సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, అందుకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంత మెరుగ్గా లేదు అని జగన్ చెబుతున్నారు.అయినా విపక్షాలు అమరావతి ప్రాంతంలో రైతులను మరింతగా రెచ్చగొడుతూ హడావుడి చేస్తున్నారు.

ఎవరు ఎంత హడావుడి చేసినా జగన్ నిర్ణయంలో మార్పు లేదు, మార్చుకోడు కూడా.

Telugu Apcm, Jagan, Jaganamaravathi-

విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ ఆలోచన.అమరవర్తిని కొత్తగా డెవలప్ చేసే బదులుగా విశాఖలో పరిపాలన సాగించి, ఆ నగరాన్ని డెవలప్ చేయాలని యోచిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న అమరావతిని ఏం చేయాలి ? అక్కడ కట్టిన భవనాల సంగతి ఏంటి ? అని ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.ఈ పరిస్థితుల్లో జగన్ వద్దకు ఓ ప్రతిపాదన వెళ్లిందట.అదేంటి అంటే ఇప్పటివరకు అమరావతిలో సేకరించిన భూములన్నీ రైతుల వద్ద తీసుకున్నవే.అందుకే అమరావతిని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటిస్తే మంచిది అనే ఆలోచనతో కొంతమంది నిపుణులు జగన్ కు సూచించినట్టు తెలుస్తోంది.అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా మార్చాలని నివేదికతో కూడిన ప్రతిపాదనను వ్యవసాయ నిపుణులు సిద్ధం చేశారట.

అక్కడ నిర్మాణాలు, రోడ్లు, భవనాలను యధాతథంగా ఉంచాలని నిపుణులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.

Telugu Apcm, Jagan, Jaganamaravathi-

పెరుగుతున్న జనాభా దృష్ట్యా, వ్యవసాయం ముఖ్యమని, విశాఖను రాజధానిగా మార్చాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో విలువైన పంటలకు అమరావతిని హబ్‌గా మార్చితే మంచిదని, దానిలో రైతులకు భాగస్వామ్యం కల్పిస్తే రైతుల మద్దతు కూడా లభిస్తుందని జగన్ ఆలోచిస్తున్నారట.ఆ భూమి మినహా మిగతా భూమిని స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (SAZ)గా వినియోగించాలని నిపుణులు చెప్పడంతో, ఆ ప్రతిపాదనలపై ఏపీ సర్కారు కసరత్తు కూడా మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.దీనిపై విపక్షాల రియాక్టన్ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube