జగన్ ఎన్నికల ఆందోళన వెనుక కారణం ఇదా ? 

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సైతం ధైర్యంగా ఎదుర్కొని అప్పటి అధికార పార్టీ టిడిపి ని అధికారంలోకి రాకుండా చేయడం లో జగన్ సక్సెస్ అయ్యారు.ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరం అమలు చేస్తూ, ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చే విధంగా జగన్ పరిపాలన చేస్తూ వస్తున్నారు.

 Jagan Tention On Local Body Elections, Jagan, Nimmagadda Ramesh Kumar, Local Bod-TeluguStop.com

ప్రజలలోనూ జగన్ పరిపాలన పై పూర్తి స్థాయిలో సంతృప్తి నెలకొంది.ఇది ఇలా ఉంటే , ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో మాత్రం జగన్ వెనకడుగు వేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.

ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో సంతృప్తి ఉంది.

ఇప్పుడికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, వైసీపీకి అధికారం దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.పైగా వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్టుగానే వ్యవహరిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించాల్సి ఉన్నందున ఎన్నికల ను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లింది.చివరకు కోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే వైసిపి ప్రభుత్వం ఈ స్థాయిలో భయాందోళనలు చెందడానికి కారణం ఏమిటనే విషయంపై ఆరా తీస్తే, జగన్ భయం అంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించేనట.ఆయన టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారుణం ఒకటైతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన అధికారులను ఆయన తప్పించే చాన్సు ఎక్కువగా ఉంటుంది అనేది జగన్ భయం గా కనిపిస్తోంది.

అలాగే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ పై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు నిమ్మగడ్డ వెనకాడరు అనే అభిప్రాయం జగన్ లో నాటుకు పోవడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ వెనకడుగు వేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan-Telugu Political News

ఇంకా చెప్పుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది.ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని తలుచుకుని ఇంతగా జగన్ కంగారు పడుతున్నట్టు గా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube