మండలిలో వైసీపీకి షాక్ తప్పదా ?  

Is There A Shock To The Ycp In The Council? - Telugu Chandrababu Naidu, Pawan Kalyan, Shock To The Ycp, Tdp, Ys Jagan, Ysrcp, వైసీపీ

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే అభిప్రాయంతో మొదటి నుంచి పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులు సంబంధించి అసెంబ్లీ లో బిల్లు పాస్ అయినా అదే పట్టుదలతో ఉంది.ఏదో ఒక రకంగా మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవాలని చేస్తుంది.

Is There A Shock To The Ycp In The Council?

అసెంబ్లీ లో తమకు బలం లేకపోవడంతో సునాయాసంగా బిల్లు పాస్ అయ్యిందని, కానీ మండలి లో అధికార వైసీపీ కంటే తమ బలమే ఎక్కువ ఉండనే ధీమా టీడీపీలో కనిపిస్తోంది.అయితే ఈ విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచింది.

మొత్తం టీడీపీ మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకున్నట్టుగా తెల్సుతోంది.తిరస్కరించడం, రెండో సారి సెలక్ట్ కమిటికీ పంపడం లేకపోతే మొదటి సారి బిల్లు వచ్చినప్పుడే సెలక్ట్ కమిటీకి పంపించడం ఇలా రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

ఏ వ్యూహం ప్రకారం చూసినా బిల్లు ఆమోదం పూర్తి కాదు.టీడీపీ వ్యూహాలకు అధికార పార్టీ కూడా అదే రేంజ్ లో వ్యూహాలను సిద్ధం చేసుకుంది.తెలుగుదేశం పార్టీని ఈ బిల్లుకి అనుకూలంగా ఒప్పించేందుకు ప్రభుత్వానికి చెందిన కొంత మంది ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే దీనికి టీడీపీ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.

ఆర్డినెన్సు చేసిన ఆరు నెలల్లోపు చట్టం చేయాలి.కానీ ముందుగా ఆర్డినెన్సు కు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఇది సున్నితమైన అంశం కాబట్టి గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను కేంద్రం పరిశీలనకు పంపితే అక్కడ తప్పనిసరిగా వైసీపీ వ్యూహం దెబ్బతింటుంది.

 అదీ కాకుండా న్యాయపరమైన వివాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది.దీనిపై కోర్టు కనుక స్టే ఇస్తే మొత్తం ప్రక్రియ నిలిచిపోతుంది.అందుకే మండలిలో టీడీపీ బిల్లును అడ్డుకుంటే రాజకీయంగా ఏం జరుగుతుందో చూస్తారంటూ మంత్రులు కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.

పోనీ మండలిని రద్దు చేద్దామన్నా దానికి తప్పనిసరిగా కేంద్రం పర్మిషన్ కావలి.ఆ ప్రక్రియ ఇప్పటికి ఇప్పుడు మొదలు పెట్టినా అది పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది.

తాజా వార్తలు

Is There A Shock To The Ycp In The Council?-pawan Kalyan,shock To The Ycp,tdp,ys Jagan,ysrcp,వైసీపీ Related Telugu News,Photos/Pics,Images..