జగన్ లిస్ట్ రెడీ ! ఆ వందమందికి ఇక చుక్కలేనా ?

వైసీపీ అధినేత జగన్ ఒక ప్రణాళిక ప్రకారం అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.తమ పార్టీనే అధికారం చేపడుతుంది అనే ధీమాలో ఉన్న ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమేమి చేయాలి ? ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలి అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాడు.ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం లో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరనే విషయాన్ని గుర్తుచేసుకుని వారిమీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం పార్టీని స్థాపించి ఎదుగుతున్న క్రమంలో జగన్ ను రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో మంది ప్రముఖ నేతలు, వ్యాపార వేత్తలు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు.

 Jagan Targets On Hundred Candidates-TeluguStop.com

అందుకే వారందరిని ఇప్పుడు జగన్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

సొంత వ్యాపారాలు, కుటుంబ వ్యాపారాలు అన్నింటికీ ప్రాధాన్యం తగ్గించుకొనేందుకు జగన్ ఇప్పటి నుంచే సిద్దపడుతున్నారట.జగన్ ఏపీ అభివృద్ధిపై దృష్టిపెడితే, శత్రువులు, ప్రత్యర్థుల సంగతి తేల్చే పనిని ఆయనకు అత్యంత నమ్మకమైన వారు తీసుకుంటారట.

ప్రస్తుతం జగన్‌కు ముఖ్యంగా రాజకీయశత్రువు చంద్రబాబు.పదేళ్లుగా జగన్‌ను చాలా మంది టార్గెట్ చేసుకున్నారు.420 అని, నేరస్థుడని, ఏపీని లూటీ చేసాడని, జైలు పార్టీ అని ఇలా ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు.ఇది ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళిపోయి అనేక విమర్శలు ఎదుర్కున్న సంగతి కూడా ఆయన గుర్తుచేసుకుంటున్నాడు.

-Telugu Political News

ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మీద కేసులన్నింటినీ బయటకి తీసి ఆయన్ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యాడట.ప్రస్తుతానికి ఓ వందమందితో కూడిన జాబితాను సిద్ధంగా ఉంచుకున్నాడట.వారందని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి తన పంతం నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇదే విషయంలో టీడీపీ నాయకుల్లో అప్పుడే ఆందోళన మొదలయ్యిందట.

ఇప్పటి వరకు అధికార పార్టీ అనే ధీమాతో వైసీపీ నాయకులను తాము టార్గెట్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు ఆ పార్టీ వారికి తాము టార్గెట్ అవుతామని లోలోపల ఆందోళన చెందుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube