జగన్‌ మరో సంచలన నిర్ణయం

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యిందో లేదో అప్పుడే ఎన్నో పథకాలను ప్రారంభించడంతో పాటు, పలు పనులు ముందుకు తీసుకు వెళ్తున్నాడు.

 Jagan Take The New Decision About Out Sourceing Employes Reservation-TeluguStop.com

ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దం అయ్యాడు.ఎన్నికల సమయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల విషయంలో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామంటూ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.

త్వరలో ఆ హామీని అమలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్తగా వేయబోతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50 శాతం వాటాను బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.

అలాగే మహిళలకు కూడా మొత్తంగా యాబై శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించారు.ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలంటూ సీఎం జగన్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఔట్‌ సోర్పింగ్‌ ఉద్యోగుల కోసం ఒక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు ఇవ్వడం చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.అలాగే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకానికి ఒక వెబ్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించాలని జగన్‌ నిర్ణయించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube