స్థానిక సమరానికి జగన్ రెడీ ? క్లీన్ స్వీప్ కోసం ఇలా ?  

ప్రస్తుతం హోరా హోరీగా సాగుతున్న గ్రేటర్ ఎన్నికల తంతు ఈ రోజుతో ముగుస్తుంది.మరో నాలుగు రోజుల్లో గ్రేటర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది తేలిపోనుంది.

TeluguStop.com - Jagan Take Key Decisions About Local Body Elections

దీంతో ఇప్పుడు  అందరి దృష్టి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పైనే ఉంది.ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తహతహలాడుతుండగా, జగన్ మాత్రం ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయడం లేదు.

అయితే ఈ విషయంలో కాస్త ఇబ్బందికర పరిణామాలను.

TeluguStop.com - స్థానిక సమరానికి జగన్ రెడీ క్లీన్ స్వీప్ కోసం ఇలా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 జగన్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రతిపక్షాలు ఎన్నికలకు తాము సిద్ధమని ఎన్నికలు నిర్వహించండి అని గట్టిగా వాయిస్ పెంచి చెబుతుంది.

ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వెనక్కి తగ్గుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళ్తున్నట్టు గా జగన్ గ్రహించారు.

అందుకే ఎన్నికలకు వెళ్లి, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ సిద్ధమైపోతున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే ఇప్పుడు వరకు వాయిదాల మీద వాయిదాలు వేసుకొంటూ వచ్చిన పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ఫ్లాట్ ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట వెంటనే దానిని పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నచోట ఆ కేసులను ఎత్తివేసే విధంగా తగిన చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.డిసెంబర్ చివరి నాటికి ఎన్నికల తంతు పూర్తిచేయాలని జగన్ డిసైడ్ అయిపోయారు.ఇప్పటికే అనేక సార్లు ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుండడం తో లబ్ధిదారులలో ఆందోళన కనిపిస్తోంది.అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారాన్ని త్వరగా ముగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

స్థలాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయగలిగితే,  తమకు ఎదురు ఉండదు అనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.అయితే ఇళ్ల స్థలాల తో పాటు, టిడ్కొ ఇళ్ల కేటాయింపులు పూర్తిచేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నా… ప్రస్తుతం ఇళ్ల స్థలాలు వ్యవహారంపై జగన్ దృష్టి పెట్టినట్టు గా కనిపిస్తున్నారు.

ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా, ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది అనే సంకేతాలను ఇచ్చేందుకు జగన్ తహతహలాడుతున్నారు.అందుకే ప్రభుత్వానికి, పార్టీకి క్రెడిట్ తీసుకు వచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా జగన్ అన్నిటిపైనా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.

#Ysrcp #Jagan #Navaratnalu #LocalBoady #Tidco Houses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు