జగన్ మరో సంచలనం! ఇకపై డిగ్రీ నాలుగేళ్ళు... ఇంజనీరింగ్ ఐదేళ్ళు  

Jagan Take Decision On Five Years Engineering - Telugu Ap Government, Five Years Engineering, Jagan Take Decision, Ysrcp

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు.మొత్తం వ్యవస్తలన్నింటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డాడు.

Jagan Take Decision On Five Years Engineering

మరో వైపు సంక్షేమ పథకాలతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇప్పటికే విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే క్రమంలో ఎలిమెంటరీలో ఇంగ్లీష్ మీడియం చదువులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉన్నత చదువులలో మార్పులు చేసి మూడేళ్ళ డిగ్రీని నాలుగేళ్ళు, నాలుగేళ్ల ఇంజనీరింగ్ ని ఐదేళ్ళకి పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్దులందరూ డిగ్రీ పట్టాలు తీసుకుని ఉద్యోగాలకు ప్రయత్నించే విషయంలో విఫలం కావడానికి కమ్యునికేషన్ స్కిల్స్, ఉద్యోగాలాకి సరిపోయే నైపుణ్యాలు లేకపోవడం వలన నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

ఇక అలంటి పరిస్థితి ఉండకూడదని చివరి సంవత్సరం కాలేజీల్లోనే నైపుణ్యం పొందేందుకు ఒక అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు.ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలు పెట్టింది.

ఈ అప్రెంటిస్ షిప్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ ప్రోగ్రాంలో చేరే విద్యార్థుల ఫీజులు, వసతి, భోజనానికి అయ్యే ఖర్చులు మొత్తం భుత్వమే చెల్లిస్తుంది.

ఇలా చేయడం ద్వారా విద్యార్ధులలో నైపుణ్యాభివృద్ధి చెంది చాలా సులభంగా ఉద్యోగాలు పొందగలరని జగన్ విశ్వసిస్తున్నట్లు తెలుస్తుంది.మరి దీనిని విద్యార్ధులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు ఎంత వరకు స్వాగాతిస్తాయనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Take Decision On Five Years Engineering-five Years Engineering,jagan Take Decision,ysrcp Related....