ధర్మాసనం కీలక ఆదేశాలు.. జగన్ ప్రభుత్వం షాక్..!

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చినట్లు అయింది.

 Judicial Key Orders Jagan Government Shock  Ap Governament, Suprime Court, Shock-TeluguStop.com

దీంతో జగన్ సర్కార్ షాక్ కి గురైంది.అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆర్-5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గానే ఉందని సీజేఐ బొబ్డే వెల్లడించారు.

అమరావతిలో ఇళ్ల నిర్మాణ జోన్ (ఆర్-5)లో మార్పులు జరపాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.ఈ స్టేను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.విచారణ మొదలు పెట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పడింది.సోమవారం విచారణ కొనసాగించారు.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన వాదనలను రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని వెల్లడించారు.స్టేకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అభిప్రాయపడ్డారు.రైతులు, పేదల స్థల కేటాయింపునకు సంబంధించిన మార్పులు తగదన్నారు.

విచారణ పూర్తయ్యే వరకు ఉత్తర్వులను ఆమోదించడం జరగదని, అప్పటివరకు పిటిషన్ ఆమోదించడం కుదరదని హైకోర్టు వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube