అతిగా ఆశపడినా..ఆవేశపడినా..ఉపయోగం లేదు!!

ఎవరు చేసిన పాపం వారికే తగులుతుంది అని అంటారు కదా.అది నిజమేనేమో ఎందుకంటే ప్రస్తుతం జగన్ తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

 Jagan Still Over Confident-TeluguStop.com

గత ఎన్నికల్లో ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయాన్నే ముంచేసి అధికారానికి దూరం చేసింది అన్న నిజం అందరికి తెలిసిందే.కానీ ఆయన ఇప్పటికీ మారలేదు.

తాజాగా కర్నూలు జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాటలు వింటే అందరూ అవ్వాక్కు అవ్వక తప్పదు.రైతు రునమాఫీ పై వైకాపా కూడా చంద్రబాబులా అబద్దాలు చెప్పి ఉంటే తాము కూడా అధికారంలోకి వచ్చే వాళ్ళం అని, అలా చెప్పి ఉంటే విశ్వసనీయత పోయేదని మళ్లీ అదే పాటను అందుకున్నారు.అంతేకాకుండా ఒకసారి అధికారంలోకి వస్తే.30 ఏళ్లు నిరాటంకంగా పాలించాలన్నదే తన లక్ష్యమని మరోసారి ముఖ్యమంత్రి పదవిపై తన ఆశని వ్యక్తం చేశారు.ఇంతవరకు బాగానే ఉన్నా అసలే మునిగిపోతున్న పడవ, ఎప్పుడు మూసేస్తారో తెలియని వ్యాపారం.పైగా పార్టీలోని నేతలు ఒక్కొక్కరుగా జంప్ అయిపోతున్నారు.ఇన్ని ఇబ్బందులు మధ్య ఇంకా అధికారంలోకి వస్తాను, వస్తే 30 ఏళ్లు పాలిస్తాను అని చెప్పడం ఆశపడుతున్నాడో.లేక ఆవేశంగా మాట్లాడాడో అర్ధం కానీ వైనం.

మరోపక్క ఆ అవకాశం అవతలి పక్షం వాళ్ళు ఇవ్వాలి కదా.ఏది ఏమైనా ఇప్పటికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి పార్టీని పటిష్టం చేసే విధంగా జగన్ చర్యలు తీసుకుంటే కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారు అని అందరి భావన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube