ఏపీలో వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన జ‌గ‌న్.. తొలి వ్యాక్సిన్ ఎవరికి వేశారో తెలుసా.. ?

సమస్త ప్రజలను గత సంవత్సరం ఒక భయంకరమైన పీడకలలా గడిపేలా చేసిన కరోనా మహమ్మారికి చరమ గీతం పాడే రోజులు వచ్చేశాయని యావత్ ప్రపంచం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.ఎందుకంటే కరోనాతో చేసిన యుద్ధంలో ఎన్నో ప్రాణాలు బలి అయిన సంఘటన అందరికి తెలిసిందే.

 Andrapradesh, Cm Ys Jagan, Covid Vaccination, Pushpakumari, Cm Ys Jagan Launches-TeluguStop.com

అప్పటి నుండి ఈ మాయదారి రోగాన్ని తరిమేయడానికి మందు ఉంటే బాగుండు అని అనుకోని వారు లేరు.ఆశతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎందరో రోజులు వెళ్లదీశారు.

వీరి కలలను నిజం చేస్తూ వైద్య శాస్త్ర సిబ్బంది కరోనాకు వ్యాక్సిన్ కనుగొంది.ఎట్టకేలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించింది.ఈ క్రమంలో ఏపీలో కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలైంది.ఏపీ సీయం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఇకపోతే ఏపీలో తొలి వ్యాక్సిన్‌ను పారిశుద్ధ్య కార్మికురాలు అయినా బి.పుష్ప కుమారికి వేశారు.వాలంటరీ గా ముందుకు వచ్చి ఆమె వాక్సిన్ వేయించుకున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube