ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరు వైసిపి వ్యతిరేక వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తున్న తరుణంలో, దీనిపై ఎటువంటి విమర్శలు చేయాలి అనే విషయంలో విపక్ష పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి.
అసలు ఈ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై జగన్ ఎందుకు అంతగా పట్టుబడుతున్నారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.అయితే జగన్ మాత్రం పక్క లెక్క తోనే కొత్త జిల్లాలను ఎంపిక ప్రక్రియ కు దిగినట్టు కనిపిస్తున్నారు.2026 లో నియోజకవర్గాల పునర్విభజన ఉండగా , ఇప్పుడు కొత్త జిల్లాలు ఎంపిక పై జగన్ ఎందుకు ఇంతగా దూకుడు ప్రదర్శిస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
జగన్ మాత్రం 2026 లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే కొత్త జిల్లాల విభజన చేపట్టినట్లు కనిపిస్తోంది.
రెవెన్యూ డివిజన్లలో మార్పుతో పాటు మిగతా చర్యలన్నీ దీనిలో భాగంగానే కనిపిస్తున్నాయి.నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ఆ ప్రభావం పిల్లలపై పడకుండా జగన్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్ర బిజెపి పెద్దలు కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం.చిన్న రాష్ట్రాలు సిద్ధాంతానికి బీజేపీ ఎప్పుడు మద్దతు పలుకుతూ ఉంటుంది.ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కేంద్రం మద్దతు పలుకుతోంది.ఇప్పటికే జగన్ నిర్ణయం పై బిజెపిలో కీలకంగా ఉన్న ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి స్వాగతించారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఆమె స్వాగతించారు.
ఇక మిగతా పార్టీలు సైతం కొత్త జిల్లాల విషయంలో ఏం మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉన్నాయి.దీనికి కారణం ప్రజల నుంచి సానుకూల స్పందన రావడమే కారణం.అక్కడక్కడ కొత్త జిల్లాలో పేర్ల విషయమై చిన్న చిన్న అభ్యంతరాలు వస్తున్న, అంతిమంగా మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్న వారే ఎక్కువగా ఉన్నారు.
దీంతో వీలైనంత తొందరగా కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది.