జగన్ సైలెంట్ స్కెచ్: అమరావతి శాసన రాజధాని కూడా కాదా..?

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక రాజధానిగా ప్రకటించాక అక్కడ ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

 Ys Jagan Silent Sketch On Amaravathi Capital, Amaravathi, Ys Jagan, Chandrababu-TeluguStop.com

చంద్రబాబు కొన్ని తాత్కాలిక బిల్డింగులు కట్టినా, ఎక్కువ శాతం గ్రాఫిక్స్ చూపించారు.దీంతో జనం బాబుని పక్కనబెట్టి జగన్‌ని గెలిపించారు.

ఇక జగన్, బాబు తీసుకొచ్చిన అమరావతిని మనం కట్టడం ఏంటి అనుకున్నారేమో, అందుకే దాన్ని నిదానంగా సైడ్ చేస్తూ వచ్చారు.

పైగా అమరావతి అనుకూలంగా లేదని చెప్పి, మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు.

అమరావతి ని శాసనరాజధానిగా చేసి, విశాఖని పాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా మార్చాలని డిసైడ్ అయ్యారు.ఇక ఇక్కడ నుంచి ఏపీ రాజకీయాలు మూడు రాజధానులు చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇదే క్రమంలో సైలెంట్‌గా జగన్ అమరావతినే పక్కకు తప్పించే కార్యక్రమం చేస్తున్నట్లు కనిపిస్తోంది.అసలు జగన్ నోట అమరావతి మాట కూడా రావడం లేదు.

Telugu Amaravathi, Ap, Chandrababu, Ys Jagan, Ysjagan-Telugu Political News

అలాగే ఈ ఏడాదిన్నర కాలంలో అక్కడ ఎలాంటి కన్‌స్ట్రక్షన్ జరగలేదు.పోనీ అమరావతిని శాసనరాజధాని చేయాలన్న ఆలోచన కూడా జగన్ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు.అందుకే తాజాగా అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె‌స్‌వేని కుదించేశారు.చంద్రబాబు ప్రభుత్వంలో అంటే 2016లో అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్ ప్రెస్ వేను ప్రతిపాదించారు.అనంతపురం-అమరావతికి నాలుగు, ఆరు వరుసల రహదారిని, 550 కి.మీ.పొడవైన రహదారిలో కొత్తగా 394.80 కి.మీ.మేర నిర్మించాల్సి ఉంది.అప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో 163 కి.మీ.మేర రహదారి నిర్మాణం జరిగింది.

అయితే అమరావతిని ఈ దీన్ని నుంచి తప్పించింది.

అమరావతి, దాని పరిసర ప్రాంతాలున్న 60 కిలోమీటర్ల మేర రహదారి ప్రతిపాదనను తొలగించి, చిలుకలూరిపేటకే పరిమితం చేసింది.ఈ ప్రాజెక్టును 335 కిలోమీటర్లకే కుదించేసింది.

డబ్బులు ఆదా అవుతాయనే పేరుతో జగన్ సర్కార్ అమరావతినే సైడ్ చేసింది.దీని బట్టి చూస్తే అమరావతి శాసనరాజధానిగా ఉండేలా కనిపించడం లేదు.

మొత్తానికైతే జగన్ ప్రభుత్వం అమరావతికి షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube