అయినా జగన్ పట్టించుకోరా ? రామ రామ !

ఏ విషయంలోనూ నాన్చుతూ నిర్ణయాలు తీసుకోవడం జగన్ కు ఇష్టం ఉండదు.జగన్ కు కష్టమైన నష్టమైన వెంటనే నిర్ణయం తీసుకోవడం జగన్ స్టైల్.

 Ap Cm Jagan Silence On Raghurama Krishnam Raju Issue,  Jagan, Narasapuram Mp, Ra-TeluguStop.com

అయితే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మాత్రం జగన్ చాలా ఓపిగ్గా భరిస్తున్నారు.అదేపనిగా విమర్శలు చేయడమే కాకుండా, టిడిపి చేయాల్సిన విమర్శలను తానే చేస్తూ, ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయారు.

చివరకు టీడీపీ నేతలు వివిధ కేసుల్లో అరెస్టయినా, రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు కంటే ఎక్కువగా స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.తాజాగా అరెస్టయిన మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యవహారంలోనూ రఘురామకృష్ణరాజు స్పందించారు.

ఉమాకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు పైన నిత్యం విమర్శలు చేస్తున్న జగన్ మాత్రం స్పందించడం లేదు.

ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అనేకమార్లు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరినా ప్రయోజనం కనిపించడం లేదు.దీంతో మరింతగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు .ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మినహా ప్రస్తుతం జగన్ కు మరో ఆప్షన్ కనిపించడం లేదు.అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి జగన్ వెనుకడుగు వేస్తుండడంతో సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Devineni Uma, Jagan, Sapuram Mp, Rebal Mp-Political

పార్టీలోనే ఉంటూ పార్టీ అధినేతను విమర్శిస్తున్న ఏమి చేయలేకపోతున్నారనే సంకేతాలు కిందిస్థాయి క్యాడర్ కు వెళితే పరిస్థితులు వేరేగా మారుతాయని, పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా తప్పుతుందని, అది రానున్న రోజుల్లో పార్టీకి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని వెంటనే రఘురామకృష్ణంరాజు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ, జగన్ నిర్ణయం తీసుకోవాలని సొంత పార్టీ నేతలు ఇప్పుడు కొత్త రాగం అందుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube