జగన్ కి “భారీ షాక్” ..పార్టీ ని వీడుతున్న ఆ “ఎంపీ”..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం , వైసీపిని అధికారంలోకి తీసుకురావడానికి తన తండ్రిలానే పాదయాత్ర చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే పాదయాత్ర మొదలైన సమయం నుంచీ టిడిపి అధినేత చంద్రబాబు యాత్రకి మైలేజ్ రాకుండా వైసీపి ఎమ్మెల్యేలని , కీలక నేతలని సైకిల్ ఎక్కిస్తూ జగన్ మైలేజ్ ని తగ్గించుకుంటూ వచ్చారు అయితే కొంత కాలం తరువాత టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కి చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు

 Jagan Shocked Ysrcp Senior Leader Mp Jump Into Tdp-TeluguStop.com

అయితే ఎన్నికలు దెగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుకి మళ్ళీ బ్రేకులు వేయాల్సిన సమయం రావడంతో చంద్రబాబు మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు.అంతేకాదు ఆ ఆపరేషన్ కూడా జగన్ కి ఎంతో బలం ఉన్న నెల్లూరు జిల్లా నుంచే మొదలుపెడుతున్నారట.

అంతేకాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనేట్టుగా చంద్రబాబు ఈ విషయంలో జగన్ కి ఎంతో దగ్గరి వ్యక్తిపైనే టార్గెట్ పెట్టారు ఇంతకీ ఆయన ఎవరో కాదు జగన్ కి అత్యంత ఆప్తుడు నెల్లూరు జిల్లా వైసీపికి మొదటి నుంచీ పెద్ద దిక్కుగా ఉన్నారు అయితే గతకొంత కాలంగా జగన్ పై తీవ్రమైన అసంతృప్తితో జగన్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది./br>


పార్టీ ని నమ్ముకుని జగన్ కి ఆది నుంచీ ఎంతో అండగా ఉన్న “మేకపాటి” ఇప్పుడు జగన్ వ్యవహార శైలిపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది అయితే ఇదే అదునుగా చంద్రబాబు మేకపాటిని టిడిపిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి అంటూ నెల్లూరు జిల్లా టిడిపి సీనియర్స్ కి బాధ్యతలు అప్పగించారట ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయాలనీ భావించినా సరే పార్టీ అంగీకారం తెలుపుతుంది అనే సిగ్నల్స్ ఇవ్వమని కూడా చెప్పారట చంద్రబాబు.అయితే మేకపాటి ఎందుకు వైసీపిని వీడాలని అనుకుంటున్నారు అంటే.

నెల్లూరు జిల్లా వైసీపి గెలుపులో ప్రధాన పాత్ర “రెడ్డి” కులస్తులదే అయితే అక్కడ.

మేకపాటి ముఖ్యంగా ఇద్దరు రాజ్యసభ సభ్యుల వలన పార్టీలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కుంటున్నారు అని టాక్ వినిపిస్తోంది.వారిలో ముఖ్యంగా జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి మరియు ‘వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి’ ఈ ఇద్దరు కూడా జిల్లాలో గ్రూపులు కడుతూ మేకపాటి ప్రాభల్యం తగ్గించడం మేకపాటిని అనేక ఇబ్బందులకి గురిచేస్తున్నారట.

/br>

అంతేకాదు నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలూ అన్నీ కూడా జగన్ వేమిరెడ్డి కి ఇవ్వడంతో మేకపాటి పై ఆయన పెత్తనం చేలాయిస్తున్నారు అని టాక్ కూడా వినిపిస్తోంది.అయితే ఈ పరిస్థితులు మింగుడు పడని మేకపాటి త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని.

ఆ నిర్ణయం టిడిపి లోకా మరేదన్నా పార్టీ లోకా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది.ఏది ఏమైనా సరే మేకపాటి లాంటి సీనియర్ లీడర్స్ ని వదులుకుంటే జగన్ కి చాలా మైనస్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube