సీనియ‌ర్ల‌కు జ‌గ‌న్ షాక్.. వారంద‌రూ అక్క‌డికే ప‌రిమితం..?

సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓ బలమైన కారణం ఉంటుందనేది వైసీపీ నేతల మాట.జగన్ ఒక్క మాట చెప్పారంటే ఎవరూ దానికి ఎదురు చెప్పరని, శిరసా వహిస్తారని ఆ పార్టీ నేతలు, మంత్రులు కూడా పదేపదే మీడియా ముఖంగా చెప్పారు.

 Jagan Shock To Seniors .. Are They All Limited There ., Jagan, Ycp,ap Politics-TeluguStop.com

ప్రస్తుతం ఏపీ సీఎం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.పార్టీ సీనియర్లను ప్రభుత్వానికి దూరం చేయాలని, అంతేకాకుండా వారికి సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించారట.

వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోరని, పార్టీకి వారి సేవలు, వ్యూహాలు అవసరమని భావిస్తున్నట్టు తెలిసింది.వచ్చే టర్మ్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సీనియర్ నేతల సలహాలు, సూచనలు అవసరం.

అందుకోసం వారికి పార్టీలోనే కీలకమైన పదవులు అప్పగించాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది.కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీనియర్లు ఎవరూ జనంలోకి వెళ్ళలేదు.

అందుకోసమే వారికి జిల్లాల వారీగా కేటాయించి నియోజకవర్గాలపై పట్టు ఎలా పెంచుకోవాలనే దానిపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారని సమాచారం.

Telugu Ap, Ap Ycp, Jagan-Telugu Political News

ఇంకా రెండేళ్ళ టైం ఉండగానే జగన్ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నట్టు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

డిసెంబరు నుంచి జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి.ఎమ్మెల్యేలు అందరూ ప్రతీ వారంలో 2 సార్లు గ్రామ సచివాలయాలను సందర్శించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

కరోనా కారణంగా వయస్సు మీద పడిన సీనియర్లకు ప్రచార బాధ్యతలు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారట.

అందుకోసమే వారందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.

సీనియర్లను మండలికి పంపించి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు.అది కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికే అవకాశం ఉంటుందని కూడా సమాచారం.

కాగా, సీనియర్ల వారసులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించేందుకు జగన్ సుముఖత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube