నేను హీరోని అంటున్న జగన్ ఏంటి సంగతి ...?     2019-01-07   00:58:44  IST  Sai Mallula

ఏపీ రాజకీయల్లో చంద్రబాబు విలన్, తాను హీరోని అన్నారు. హీరోను కాబట్టే అందరూ తనను ఇష్టపడుతున్నారని చెప్పారు.తాను ఎన్నికలకు ముందు ఏ పార్టీకీ మద్దతివ్వబోనని.. ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ ప్రత్యేక హోదాపై సంతకం పెడితే దానికి మద్దతిస్తానని చెప్పారు. అది బీజేపీ కావొచ్చే, కాంగ్రెస్ కావొచ్చు.. చివరకు ఎల్లయ్య, పుల్లయ్య ఎవరైనా సరే ప్రత్యేక హోదా ఇస్తే వారికి తన మద్దతు ఇస్తానని చెప్పారు.

Jagan Sesational Coments-Ysrcp High Court

Jagan Sesational Coments

దేవుని దయ, ప్రజల దీవెనలు తమకు ఉన్నాయని.. ఈసారి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. తాను పూర్తిగా ఏపీపై దృష్టిపెడుతూ తెలంగాణపై దృష్టిపెట్టలేకపోయానని.. అలాంటప్పుడు అక్కడ పోటీ చేయడం సరికాదని భావించి పోటీ చేయలేద జగన్ చెప్పారు.