ప్లీనరీ వేదికగా జగన్ సంచలన నిర్ణయాలు ! అవేంటంటే ?

ఏపీ సీఎం జగన్ అంతరంగం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు.

 Jagan Sensational Decision Announced On Party Plenary Details, Ap Cm Jagan, Ysrc-TeluguStop.com

కేవలం అతి కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే జగన్ అందుబాటులో ఉంటున్నారు.పార్టీ , ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నాయకుల ద్వారా చేస్తూ ఉంటారు.

ఎమ్మెల్యేలకు సైతం జగన్ అపాయింట్మెంట్ దొరకడం అనేది గగనంగా మారిపోయింది.మొదటి నుంచి ఇదే రకమైన విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు.

ఎక్కువగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి జగన్ పరిమితం అయిపోతున్నారు తప్ప , క్షేత్రస్థాయిలో పని చేసేందుకు ఆయన ఇష్టపడకపోవడం వంటివి జనాలు,  పార్టీ శ్రేణులను ఆయనకు దూరం చేస్తున్నాయనే అభిప్రాయాలు చాలా కాలం నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి.ఇక మంత్రులకు సైతం కేబినెట్ సమావేశాల్లో తప్ప జగన్ దర్శనం లభించకపోవడంతో,  తమ సమస్యలను జగన్ కు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణా రెడ్డి,  విజయసాయిరెడ్డి,  సుబ్బారెడ్డి వంటి వారికి చెప్పుకుంటూ వస్తున్నారు.

అయితే ఈ విషయంలో పార్టీ శ్రేణులలోను , ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.ఎన్నికల  సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారట.

ఈ మేరకు మరి కొద్ది రోజుల్లో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ అంశం గురించి జగన్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.ఇకపై పూర్తిగా పార్టీ నాయకులకు,  సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా జగన్ ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారట.

ప్రతి అసెంబ్లీ,  నియోజకవర్గ స్థాయిలో ను కొత్త కమిటీల నియామకం చేయబోతున్నట్లు సమాచారం.తనను కలవాలనుకునే వారికి అవకాశం కల్పించి వారి కోసం రోజుల్లో కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారట.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ ప్లీనరీలో జగన్ ప్రకటిస్తారట.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Vijayasai, Ysrcp, Ysrcp Plenary, Yvsubba-Po

అలాగే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జనాలకు చేరువయ్యేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని మొదలు పెట్టి,  జనాలకు చేరువ కావాలని చూస్తున్నారట.అలాగే ఏపీ లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోవడం లేదని,  మొత్తం సొమ్మంతా సంక్షేమ పథకాల కోసమే జగన్ ఖర్చు పెడుతున్నారనే విమర్శలకు చెక్ పెట్టే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారట .తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రజలకు వివరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.అలాగే నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి, వారి పనితీరు అన్నిటి పైన ఇప్పటికీ నివేదికలు చెప్పించుకోవడంతో పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు గట్టిగా జగన్ క్లాస్ పీకేదుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube