ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌నం  

jagan sensational decision about ap elections, Jagan, Ap, Ap Local Body Elections, Nimmagadda Ramesh, Ap Election Officer, Kangaraj, Coronavirus, Ap Election Notification - Telugu Ap, Ap Election Notification, Ap Election Officer, Ap Local Body Elections, Coronavirus, Jagan, Jagan Sensational Decision About Ap Elections, Kangaraj, Nimmagadda Ramesh

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నట్టే కనిపిస్తోంది.స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేషన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది.

TeluguStop.com - Jagan Sensational Decision About Ap Elections

వాస్త‌వానికి మార్చిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డం, తొలి విడ‌త నామినేష‌న్ల ప‌ర్వంలో వైసీపీ చాలా చోట్ల ఏక‌గ్రీవ విజ‌యాలు సాధించింది.ఆ త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ క‌రోనాను సాకుగా చూపించి ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం జ‌గ‌న్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

చివ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ‌పై ప్రెస్‌మీట్ పెట్ట‌డంతో పాటు ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించేసి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను నియ‌మించుకున్నారు.ఆ త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ చివ‌ర‌కు కోర్టుకు వెళ్లి మ‌రీ ఆయ‌న తిరిగి నియామ‌కం అయ్యేలా చేసుకున్నారు.

TeluguStop.com - ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌నం-Political-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నిమ్మ‌గ‌డ్డ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.అయితే ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం నిమ్మ‌గ‌డ్డ నేతృత్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు లేదు.

తాజాగా నిమ్మ‌గ‌డ్డ ఏపీలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అంశంపై అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యించ‌గా.దీనిని బ‌హిష్క‌రించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఆఘ‌మేఘాల మీద స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసీజ‌ర్ భేటీ ఏర్పాటు చేసి… ఇందులో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఎలా అడ్డుకోవాల‌న్న అంశం మీదే ప్ర‌ధానంగా చ‌ర్చించింద‌ని తెలుస్తోంది.ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌ష్టం అని చెప్పేందుకే.

ప్ర‌భుత్వం కౌంట‌ర్ ఇచ్చేందుకే ర‌హ‌స్యంగా ఈ భేటీ ఏర్పాటు చేశార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే మార్చి వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ కాలం ఉంటుంది.

ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నికలు నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ ఎంత మాత్రం సుముఖంగా లేర‌నే అర్థ‌మ‌వుతోంది.ఆ త‌ర్వాతే జ‌గ‌న్ మ‌రి కొంత గ్యాప్ తీసుకునే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లే వీలుంది.

ఏదేమైనా మ‌రోసారి నిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య కోల్డ్‌వార్ త‌ప్పేలా లేదు.

#ApElection #Coronavirus #APLocal #Jagan #Kangaraj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Sensational Decision About Ap Elections Related Telugu News,Photos/Pics,Images..