మేనిఫెస్టో ఖురాన్ లా,బైబిల్ లా,భగవద్గీత లా భావిస్తా: జగన్

మేనిఫెస్టో అనేది చెత్త బుట్టలో పడేసేది కాదని దానిని ఒక ఖురాన్ లా,బైబిల్ లా, భగవద్గీత లా భావిస్తా అని ఏపీ నూతన ముఖ్యమంత్రి,వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ రోజు మధ్యాహ్నం 12:23 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో జగన్ నవ్యంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం సర్వమత ప్రార్ధనలు పూర్తి అయిన తరువాత డీఎం కే నేత స్టాలిన్,తెలంగాణా సి ఎం కేసీఆర్ లు అభినందనలు తెలిపారు.అనంతరం ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన తోలి ప్రసంగాన్ని ప్రజలకు వినిపించారు.

 Jagan Says Manifesto Means Khuranbaibilbhagvatgeetha-TeluguStop.com

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ….ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి మేనిఫెస్టో ని తయారు చేసి చివరికి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని చెత్త బుట్టలో పడేసే విధంగా మేనిఫెస్టో తీసుకురాలేదని, కేవలం రెండు పేజీలతో ప్రజలకు అర్ధం అయ్యేలా మేనిఫెస్టో రూపించి దాని అమలుకు కృషి చేస్తానని తెలిపారు.

-Telugu Political News

మేనిఫెస్టో అనేది ప్రజలకు అర్ధం అయ్యే విధంగా ఉండాలి అని పేజీలు పేజీలు మేనిఫెస్టో లో పొందుపరచి చివరికి అమలు చేయకుండా చెత్త బుట్టలో పడేశారని ఆయన ఇతర పార్టీల మేనిఫెస్టో లపై సెటైర్లు వేశారు.మేనిఫెస్టో ను ఒక ఖురాన్ లా, బైబిల్ లా, ఒక భవద్గీత లా భావిస్తానని తెలిపారు.అలానే అవ్వ,తాతల పెన్షన్ 3000 లకు పెంచుతాను అని చెప్పినట్లు గానే పెన్షన్ ను ఏడాదికి 250 రూపాయల చెప్పున పెంచుతున్నానని, ఆ ఫైల్ పైనే తోలి సంతకాన్ని చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.ఇలా నాలుగేళ్ల లో పెన్షన్ ను 3000 రూపాయలకు పెంచుతాం అని జగన్ స్పష్టం చేశారు.

అలానే పలు విషయాలను ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube