నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌  

Jagan Says Good News For Un Employement In Andhrapradesh - Telugu Ap Cm Jagan Mohan Reddy, Appsc Notification Release In Soon, Groups And Interview Selction Process, Jagan

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై తనదైన ముద్రను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే పలు కొత్త పథకాలను తీసుకు వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి వృద్దులు మరియు నిరుద్యోగుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్దను చూపిస్తున్నాడు.

Jagan Says Good News For Un Employement In Andhrapradesh

ఇప్పటికే నిరుద్యోగ బృతం అంటూ ప్రకటించిన జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలో భారీ ఎత్తున నియామకాలను చేపట్టేందుకు సిద్దం అవుతున్నాడు.

ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి సంవత్సరం ఇకపై నియామకాలు నిర్వహించాలని జగన్‌ నిర్ణయించాడు.

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌-Political-Telugu Tollywood Photo Image

అందుకు సంబంధించిన క్యాలెండర్‌ ప్రతి ఏడాది విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.ఇక ఉద్యోగాల నియామక పక్రియలో కూడా మార్పులు తీసుకు రాబోతున్నట్లుగా జగన్‌ ప్రకటించాడు.

ఇప్పటి వరకు గ్రూప్స్‌ నియామకాల్లో ఇంటర్వ్యూ ఉండేది.ఇకపై ఇంటర్వ్యూ ఉండదు.

కేవలం రాతపరీక్ష మాత్రమే ఉంటుంది.ఇంటర్వ్యూ సందర్బంగా అక్రమాలు జరుగుతున్నాయని, అధికారులు కొందరు చేతివాటం చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్‌ దృష్టికి వచ్చిందట.

అందుకే ఇంటర్వ్యూను తొలగించాడు.దాంతో నిరుపేద మెరిట్‌ విద్యార్థులకు ఈ నిర్ణయంతో మంచి జరుగుతుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు