గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు జగన్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా సరి కొత్త వెరైటీ లతో మధ్యాహ్న భోజనం అందిస్తూ జగనన్న విద్యా కానుక ద్వారా రెండు జతల స్కూల్ యూనిఫామ్ తో పాటు పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తూ ఉంది.

 Jagan Sarkars Gift To Government School Children Ys Jagan, Ys Jagan Vidhya Kanuk-TeluguStop.com

మరి అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం కూడా ప్రవేశపెట్టడం అందరికీ తెలిసిందే.

Telugu Andhra Pradesh, Jagananna, Ys Jagan, Ysjagan-Telugu Political News

రపంచంలో చాలావరకు ఉద్యోగాలు ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్లు అందుకుంటున్న తరుణంలో చిన్ననాటి నుండి ఇంగ్లీష్ అలవరచుకోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు పొందవచ్చని జగన్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది.అదేమిటంటే ఉచితంగా ఇంగ్లీష్ డిక్షనరీ ఇవ్వాలని సర్కారు డిసైడ్ అయింది.

రోజుకి ఒక్క ఇంగ్లీష్ పదం నేర్చుకునే రీతిలో పిల్లలకు విద్యను అందించాలని తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఒక్క పాఠశాలల్లో మాత్రమే కాక వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగనన్న సూచన.

మార్చి 20వ తేదీ నుంచి పుస్తకాల పంపిణీ ప్రారంభించి, ఏప్రిల్‌ 5 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube