వైసీపీలో ర‌గులుతోన్న జ‌గ‌న్ రైట్ హ్యాండ్‌...!

ఏపీలో పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రిలో అధికార వైఎస్సార్‌సీపీలో గ్రూపుల గోల రాజుకుంది.ఇప్ప‌టికే అక్క‌డ మంత్రులుగా ఉన్న‌వారిలో కుర‌సాల క‌న్న‌బాబు ఓ వ‌ర్గంగా ఉంటే.

 Jagan Right Hand On Full Angry,jagan,ap,ap Cm,chief Minister,jagan Mohan Reddy,d-TeluguStop.com

ఇటీవ‌ల మంత్రి అయిన చెల్లుబోయిన వేణు మ‌రో వ‌ర్గంగా ఉంటున్నారు.ఇక మ‌రో మంత్రి విశ్వ‌రూప్ సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు.

జిల్లాలో ఇప్ప‌టికే రాజోలులో పార్టీకి ద‌గ్గ‌ర‌రైన జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు, ఎన్నిక‌ల్లో ఓడిన బొంతు రాజేశ్వ‌ర‌రావు వ‌ర్గాల మ‌ధ్య ప‌డ‌ట్లేదు.ఇక అమ‌లాపురం ఎంపీ చింతా అనూరాధ‌కు ఆమె పార్ల‌మెంటు ప‌రిధిలోని ఒక‌రిద్ద‌రు నేత‌ల‌తో పొస‌గ‌ట్లేదు.

ఇక రామ‌చంద్రాపురంలో మంత్రి వేణుకు, పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల‌కు ప‌డ‌ట్లేదు.ఇక గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే చిట్టిబాబు సైతం మంత్రుల నుంచి స‌హ‌కారం లేద‌ని వాపోతున్నారు.

రాజోలులోనే ఇన్‌చార్జ్ అమ్మాజీకి, మాజీ ఇన్‌చార్జ్ రాజేశ్వ‌ర‌రావుకు గొడ‌వ‌లు.ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఎంపీ భ‌ర‌త్‌కు, రాజానగ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాకు తీవ్ర‌మైన విబేధాలు ఉన్నాయి.

ఇక కాకినాడ సిటీలో మంత్రి క‌న్న‌బాబుకు, సిటీ ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి వార్ న‌డుస్తోంది.

Telugu Amalapuram, Ap Cm, Dwarampudi, Jagan, Jagan Hand, Jaganhand, Rajeswara Ra

ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో గొడవ చేరింది.జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, ఆ కుటుంబానికి ఎంతో న‌మ్మ‌క‌స్తుడు అయిన మాజీ మంత్రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన పిల్లి బోస్ డీఆర్సీ స‌మావేశంలో తీవ్రంగా ఫైర్ అయ్యారు.కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోన్న అవినీతి గురించి మాట్లాడ‌డంతో బోస్‌పై సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్‌రెడ్డి బోస్‌పై తీవ్రంగా దుర్భాష‌లాడారు.

బోస్‌కు పెద్ద మ‌నిషి అన్న పేరుంది.ఆయ‌న అవినీతికి దూరంగా ఉంటారు.త‌న సొంత జిల్లాలో జ‌రుగుతోన్న అవినీతిని చూసి స‌హించ‌లేకే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసినట్టు వైసీపీలోనే గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

బోస్ ఆవేద‌న వెన‌క ఆయ‌న‌కు పార్టీలో ప్ర‌యార్టీ లేక‌పోవ‌డ‌మే అంటున్నారు.

త‌న సామాజిక వ‌ర్గంలో నిన్న‌టి వ‌ర‌కు జిల్లాలో ఆయ‌న‌దే పెత్త‌నం.అలాంటిది త‌న సీటు రామ‌చంద్రాపురంలో త‌న వ‌ర్గానికే చెందిన చెల్లు బోయిన వేణుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డంతో పాటు త‌న‌ను మండ‌పేట పంపిం ఓడించేశారు.

ఇక వేణుకు మంత్రి ప‌ద‌వితో పాటు పెత్త‌నం ఇవ్వ‌డంతో బోస్ క‌మ్యూనిటీలో డ‌మ్మీ అయిపోయారు.పైగా ఇప్పుడు ఆయ‌న్ను రాష్ట్ర రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా రాజ్య‌స‌భ ఇచ్చి ఢిల్లీ పంపేశారు.

ఇక రెండున్న‌ర ద‌శాబ్దాలుగా త‌న‌కు రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న తోట త్రిమూర్తుల‌ను పార్టీలోకి తీసుకుని.అమ‌లాపురం పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు తాను పోటీ చేసిన మండ‌పేట పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో బోస్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌.

ఇవన్నీ స‌హించ‌లేకే బోస్ జ‌గ‌న్ రైట్ హ్యాండ్‌గా ఉన్న ద్వారంపూడి నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మాల‌పై గొంతెత్తార‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube