టీఆర్ఎస్ ఎఫెక్ట్ : వైసీపీ ఎమ్మెల్యే మంత్రులపై జగన్ నిఘా ? 

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీ ని కలవరానికి గురి చేస్తుంది.ఇప్పుడు అదే రకమైన పరిస్థితి తలెత్తకుండా, ముందుగానే ఏపీ సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

 Jagan Reveals Details About Ministers And Mlas Through Intelligence Agencies, Ap-TeluguStop.com

ముఖ్యంగా పార్టీలో చాలాకాలంగా నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉండడం, బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.ఈ విధంగా చాలా రాజకీయ  పరిణామాలను జగన్ లెక్కలోకి తీసుకుంటున్నారు.

పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా, పరిస్థితిలో మార్పు రాకపోవడం మరికొంతమందికి వార్నింగ్ ఇస్తున్నా, పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో, ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బిజెపి పార్టీలకు కలిసి వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు.

Telugu Ap Cm Ys Jagan, Intelligence, Jaganreveals, Ministers Mlas, Trs, Ycp-Poli

అదీ కాకుండా త్వరలోనే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు ఉండడంతో, ప్రతిపక్షాలకు అవకాశం దక్కుతుందని  వైసిపి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విధంగా జగన్ ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇటీవలే విశాఖకు చెందిన  కొంతమంది ఎమ్మెల్యేలు వైసిపి రాజ్యసభ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బహిరంగంగానే విమర్శలకు దిగడం తో జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, బహిరంగంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పై వారిని స్వయంగా పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీలో కొంతకాలంగా కొంతమంది మంత్రులు ,ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలకు పాల్పడుతోందని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండకుండా , మౌనంగా ఉండడం వంటి వాటిని జగన్ సీరియస్ గానే పరిగణిస్తున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది ? నియోజకవర్గాల్లో వారి పరిస్థితి ఏమిటి ? అవినీతి వ్యవహారాల్లో తలదూర్చుతున్నారా, లేక వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలా అనేక అంశాలపై నిఘా విభాగాల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకునతున్నట్టు గా తెలుస్తోంది.

Telugu Ap Cm Ys Jagan, Intelligence, Jaganreveals, Ministers Mlas, Trs, Ycp-Poli

 ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని , పార్టీ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అలాగే కొంత మంది మంత్రుల పనితీరు సక్రమంగా లేని క్రమంలో, మంత్రివర్గ ప్రక్షాళన చేసి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఏపీ అధికార పార్టీ కి కాస్త కంగారు పుట్టిస్తున్నట్టు గా కనిపిస్తోంది.ఇక మంత్రులు, ఎమ్మెల్యే లపై నిఘా నిరంతరం  కొనసాగించాలి అనే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు గా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube