ముఖ్యమంత్రిగా జగన్ జీతం ఒక్క రూపాయి! ఎన్టీఆర్ తర్వాత జగనే

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం సమయం దగ్గర పడింది.ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పరిపాలన తీరు ఎలా ఉండబోతుంది.

 Jagan Ready To Take One Rupee Salary For Chief Minister Duty-TeluguStop.com

ముఖ్యమంత్రిగా జగన్ మొదటి నిర్ణయం దేనిపై తీసుకుంటాడు.ఇక వైసీపీ ప్రభుత్వం పరిపాలన విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఏపీలో సుదీర్ఘ రాజకీయం లక్ష్యం, వచ్చిన అధికారాన్ని వీలైనంత ఎక్కువ కాలం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్ దానికి తగ్గట్లుగానే తన ఆలోచనలు నడిపిస్తున్నాడని తాజాగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాటల బట్టి అర్ధమవుతుంది.ముఖ్యమంత్రిగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న, అది పార్టీ సుదీర్ఘ ప్రయాణంని ప్రభావితం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సీఎంగా నెలకు రూపాయి జీతం మాత్రమే ఆయన తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.తన జీతం ఏపీ ఖజానాకు అదనపు భారం కాకూడదని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.జగన్ బాటలోనే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నడుస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకున్నారు.మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత మరల జగన్ ఎన్టీఆర్ తరహాలో రూపాయి వేతనంకి సిద్ధం అవుతున్నాడు.నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జీతం నెలకి రెండున్నర లక్షల పైనే ఉంది.

మొత్తానికి అంత జీతాన్ని వదులుకొని పని చేయడం అనేది జగన్ తీసుకున్న నిర్ణయాలలో గొప్పది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube