ముందు ముందు ఆ పార్టీలకు జగన్ షాక్ లు తప్పవా ?  

Jagan Ready To Give The Impact In Janasena And Tdp Parties-chandrababu Naidu,jagan,tdp,ycp Jagan Mohan Reddy

పార్టీని స్థాపించిన తర్వాత సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండడంతో పాటు అధికారంలోకి వచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.తెలుగుదేశం పార్టీ చేతిలో 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా వైసీపీలో ధీమా మాత్రం తగ్గలేదు.కానీ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 23 మందిని టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చింది.దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది.

Jagan Ready To Give The Impact In Janasena And Tdp Parties-chandrababu Naidu,jagan,tdp,ycp Jagan Mohan Reddy-Jagan Ready To Give The Impact In Janasena And TDP Parties-Chandrababu Naidu Jagan Tdp Ycp Mohan Reddy

పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది.అయినా వైసీపీకి ఆ విషయంలో న్యాయం జరగలేదు.అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైసిపి నాయకులు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

Jagan Ready To Give The Impact In Janasena And Tdp Parties-chandrababu Naidu,jagan,tdp,ycp Jagan Mohan Reddy-Jagan Ready To Give The Impact In Janasena And TDP Parties-Chandrababu Naidu Jagan Tdp Ycp Mohan Reddy

ప్రస్తుతం వైసిపి అధికారంలోకి వచ్చింది.అధికార పార్టీ కావడంతో సహజంగానే ఆ పార్టీలోకి వలసలు వచ్చేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు సిద్ధమయ్యారు.

కానీ జగన్ మాత్రం చేరికల విషయంలో అనేక నియమ నిబంధనలు విధించాడు.ఇతర పార్టీ నాయకులు వైసీపీలో ఎక్కువగా చేరితే లేనిపోని గ్రూపు తగాదాలు ఏర్పడతాయని జగన్ భావించారు.అందుకే ఆ పార్టీలోకి చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఇదే అదునుగా బిజెపి ఏపీలో బలపడేందుకు పావులు కదపడం ప్రారంభించింది.వైసీపీలో చేరాలనుకున్న నాయకులంతా బీజేపీలో చేరడంతోపాటు వైసీపీపై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలో వైసీపీలోకి వలసలు ప్రోత్సహించాలని జగన్ నిర్ణయించుకున్నారట.

ఈ నేపధ్యంలోనే తెలుగుదేశం, జనసేన జనసేన పార్టీకి కి చెందిన కీలక నాయకులు వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.తాజాగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్, జనసేన పార్టీ కి చెందిన ఆకుల సత్యనారాయణ తదితరులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఇకపై వీలైనంత ఎక్కువమందిని పార్టీలో చేర్చుకుని ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో జగన్ ఈ విధంగా వలసల విషయంలో కాస్త నిబంధనలు సడలించినట్టుగా అర్థమవుతోంది.