ఆ మంత్రుల‌ను త‌ప్పించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారా... !

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో 10 నెల‌ల్లో త‌న మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు చేయ‌నున్నారు.జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడే ఇప్పుడు మంత్రులుగా ఉన్న‌వారిలో 90 శాతం మందిని త‌ప్పిస్తాన‌ని ముందే చెప్పారు.

 Jagan Ready For Removing These Ysrcp Leaders For Their Posts,ap,jagan Mohan Redd-TeluguStop.com

వీరిలో కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని మందే చెప్పారు.ఇప్పుడు జ‌గ‌న్ చెప్పిన‌ట్టుగానే ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను త‌ప్పించే విష‌యంలో ఆయ‌న ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టే పార్టీ, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

జ‌గ‌న్ కేబినెట్ మార్పులు, చేర్పుల్లో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ప‌నితీరు ప్రాతిప‌దిక‌న అంచ‌నాల‌కు వ‌చ్చార‌ని అంటున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కేబినెట్లో ఇద్ద‌రు మంత్రుల‌ను మాత్ర‌మే త‌ప్పించారు.వీరిద్ద‌రు రాజ్య‌స‌భకు వెళ్ల‌డంతో ఆ ఇద్ద‌రి స్థానంలో అదే సామాజిక వ‌ర్గాల నుంచి మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌ను జ‌గ‌న్ తీసుకున్నారు.ఇక కొంద‌రు మంత్రుల‌పై తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

వీరిలో కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం ఉన్నారు.ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ఉంటుందంటున్నారు.ఇక తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ముగ్గురు మంత్రుల‌ను త‌ప్పించేస్తారంటున్నారు.కోస్తాలో ఓ జిల్లాలో ముగ్గురు మంత్రులు వేస్ట్ అన్న టాక్ రావ‌డంతో.

ఆ ముగ్గురిని ప‌క్క‌న పెడ‌తారంటున్నారు.ఈ ముగ్గురు మంత్రులు క‌నీసం త‌మ శాఖ‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు.

క‌నీసం ప్రెస్‌మీట్లు లేవు.పార్టీ త‌ర‌పున వాయిస్ వినిపించ‌డం కూడా లేద‌న్న విష‌యం అధిష్టానం గుర్తించింది.

ఇక క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన మంత్రుల విష‌యంలో కూడా జ‌గ‌న్ సంతృప్తిగా లేరు.ఇక ప్ర‌కాశం, కృష్ణా జిల్లాల‌కు చెందిన కొంద‌రు మంత్రులు కూడా మార్పుల్లో ప‌దవులు కోల్పోవ‌డం ఖాయ‌మే.

ఏదేమైనా మంత్రి వ‌ర్గంలో మార్పుల భ‌యం చాలా మంది మంత్రుల‌కు ఉంది.కొంద‌రు మాత్రం క‌రోనా బూచీగా చూపించి.

స‌రిగా ప‌ని చేయ‌లేక‌పోయామ‌ని చెప్పేందుకు సాకులు వెతుక్కుంటున్నార‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube