మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ సిద్ధం ? వడబోతలో బిజీగా సజ్జల ?

ఏపీ క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నర సంవత్సరాలు అవుతున్న క్రమంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Jagan Ready For Cabinet Changes Sajjala Ramakrishnareddy Is Making The- Ist Sajj-TeluguStop.com

పూర్తిగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయకపోయినా, అవినీతి ఆరోపణలతో పాటు, పనితీరు సక్రమంగా లేని వారు, వివాదాస్పద అంశాలతో వార్తల్లో ఉంటూ, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తూ, ఆ స్థానంలో సామాజిక వర్గాల వారీగా తనకు అత్యంత నమ్మకస్తులైన, పార్టీకి వీర విధేయులైన వారిని మంత్రులుగా తీసుకోవాలని జగన్ అభిప్రాయపడుతున్నారు.అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టుగానే కనిపిస్తోంది.

దీనిలో భాగంగానే జగన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.ప్రస్తుత మంత్రి వర్గంలో ఎవరిని ఉంచాలి ? ఎవరిని తప్పించాలి నే విషయంపైనే గత కొద్ది రోజులుగా ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా మహిళా మంత్రులలో సుచరిత తప్ప మిగతా వారందరిని తప్పించేందుకు చూస్తున్నారట.అయితే వీరి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అనేది పూర్తిగా క్లారిటీ లేకపోయినప్పటికీ, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, సింగనమల ఎమ్మెల్యే పద్మావతి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని తదితర పేర్లు తెరపైకి వచ్చాయి.

Telugu Ap, Ap Cm, Ap Advisor, Jagan, Rk Roju, Sucharitha, Vidudala Rajani-Telugu

వీళ్లల్లో కొంతమందికి అవకాశం దక్కబోతున్నట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం మొదలైంది.ఇప్పటికే వీరి అందరితోనూ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత మంత్రులలో పదవి పోతుంది అనే భయం ఉన్న వారు, తమ పదవికి ఏ ఢోఖా లేకుండా చూసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా మంత్రివర్గ ప్రక్షాళన అంటూ మొదలుపెడితే ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటాయి అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube