హమ్మయ్య : మంత్రులకు ఆ టెన్షన్ తగ్గించిన జగన్ ?

ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎమ్మెల్యేలు చూపు అంతా మంత్రి పదవులు పైనే ఉంటుంది.తమకు అవకాశం దక్కాలని కోరుకుంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు.

 Jagan Postpones Cabinet Expansion For Some Time, Jagan, Ap Ministers, Ysrcp, Ys-TeluguStop.com

అధినేత దగ్గర ఆ మేరకు మార్కులు సంపాదించి , తమకు మంత్రి పదవి దక్కేలా చేసుకుంటారు.అయితే అందరి దగ్గర ఈ తరహా వ్యవహారాలు నడిచినా,  వైసీపీ అధినేత జగన్ దగ్గర మాత్రం ఆ వ్యవహారాలు ఏమి చెల్లుబాటు కాలేదు.

ఎప్పుడూ లేని విధంగా తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కన పెట్టి, చాలా వరకు కొత్త వారికీ, కేవలం నియోజక వర్గ స్థాయి రాజకీయాలకు పరిమితం ఆయిన వారికి జగన్ మంత్రి పదవులు ఇచ్చారు.
 సామాజికవర్గాల సమ తూకం ఖచ్చితంగా పాటించారు.

మంత్రులుగా ఏపీ ప్రజలకు పెద్దగా పరిచయంలేని కొత్తవారిని దాదాపుగా ఎంపిక చేశారు.అయితే మంత్రి పదవి ఇచ్చిన సమయంలోనే రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఆ పదవి ఉంటుందని , ఆ తర్వాత వేరే వారికి ఆ  స్థానాల్లో అవకాశం కల్పిస్తామనే షరతు ను సైతం విధించారు.

అయితే మంత్రి పదవులను తీసుకున్నవారిలో మొదట్లో ఆనందం కనిపించినా,  ఇప్పుడు అది కనిపించడం లేదు.తాము పదవిలో కూర్చున్న తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, కరోనా వైరస్ ప్రభావం తదితర కారణాలతో, పూర్తిస్థాయిలో మంత్రి పదవులను అనుభవించలేక పోయామని, మంత్రి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను చేయలేకపోయాము అనే అసంతృప్తికి చాలా మంది మంత్రుల్లో కనిపిస్తూ వస్తోంది.
 

Telugu Ap, Ap Ministers, Carona, Jagan, Jagan Troubles, Ysrcp, Ysrcp Mlas-Politi

త్వరలో జగన్ మంత్రివర్గం ను ప్రక్షాళన చేసి, ప్రస్తుతం ఉన్న వారిలో మూడు వంతుల మందిని తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పిస్తారని, చాలామంది టెన్షన్ పడ్డారు.తమకు ఉన్న పలుకుబడి ద్వారా జగన్ వద్దకు రాయబారాలు నడిపి, తమ మంత్రి పదవికి ఢోకా లేకుండా చేసుకునేందుకు ఇప్పటికీ చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.ప్రస్తుతం పెద్ద ఎత్తున ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసే ప్రక్రియలో జగన్ నిమగ్నమయ్యారు.

Telugu Ap, Ap Ministers, Carona, Jagan, Jagan Troubles, Ysrcp, Ysrcp Mlas-Politi

ఇది ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని ప్రక్షాళనం చేస్తారు అని అంతా అనుకుంటున్నా, జగన్ మాత్రం మరో ఆరు నెలలు పాటు మంత్రివర్గాన్ని యధావిధిగా ని ఉంచాలని , ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా లేనందున , ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ ప్రక్షాళన చేపడితే అనవసర ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణకు కొంతకాలం గడువు పెంచాలని నిర్ణయించుకున్నారట .ఇదే విషయాన్ని తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత కొంతమంది దగ్గర జగన్ ప్రస్తావించడంతో,  ప్రస్తుత మంత్రులు రిలాక్స్ అయ్యారట.మరి కొంత కాలం పాటు తమ పదవులకు ఎటువంటి డోకా లేదనే ఆనందంలో మునిగి తేలుతున్నారట.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube