ఓడినా పై చేయి నాదే అంటున్న జగన్ ? అసలు సంగతి ఇదే  

Jagan Play The Political Game With Tdp Chief Chandrababu Naidu-ap Cm Jagan Mohan Reddy,jagan,tdp Ministers

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ విజయోత్సవ సంబరాల్లో ఉంది.ఏపీ శాసనమండలి లో మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లుకు అడ్డుకట్టలు పడడంతో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

Jagan Play The Political Game With TDP Chief Chandrababu Naidu-Ap Cm Mohan Reddy Jagan Tdp Ministers

మొదటి నుంచి పోరాడుతున్న తమ వాదన గెలిచిందని టిడిపి సంతోషంగా ఉంది.అయితే ఇదంతా జగన్ రాజకీయ వ్యూహంలో భాగంగానే జరిగిందన్న విషయం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

వైసిపి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్గాన్ని జగన్ ఎందుకున్నట్టు తెలుస్తోంది.శాసనమండలిలో ఈ బిల్లు పాస్ అయ్యి ఉంటే వైసీపీ ప్రభుత్వానికి ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదు.

అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చెలరేగే ఉండేవి.కానీ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రజల్లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.

రాష్ట్ర ప్రయోజనాలకు అక్రమ మార్గంలో చంద్రబాబు అడ్డుతగులుతున్నరనే భావన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.వాస్తవంగా శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పాస్ అవ్వదని తెలుసు.

ఒకవేళ పాస్ చేయించాలనుకుంటే దానికి జగన్ వేరే మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు.ఆర్థిక బిల్లులు ప్రవేశ పెట్టి ఉంటే టిడిపికి దానిని అడ్డుకునే అవకాశం ఉండేది కాదు.

కానీ జగన్ ఆ విధంగా చేయలేదు.టిడిపికి శాసనమండలిలో బలం ఎక్కువ.అక్కడ ఆ పార్టీ సభ్యులు సంఖ్య ఎక్కువ అని జగన్ కు ముందే తెలుసు.అలాగే ఖచ్చితంగా సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లు వెళుతుందని జగన్ కు ముందుగానే తెలుసు.

అయినా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజల్లో లోతుగా చర్చ జరగడమే కాకుండా టిడిపి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఉద్దేశంతోనే జగన్ ఈ రూట్లో వెళ్లినట్లు తెలుస్తోంది.

శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు కారణంగా జగన్ నిర్ణయం 3 నెలల పాటు వాయిదా పడుతుంది.ఇక జగన్ ఈ నిర్ణయానికి రావడానికి కారణం వెనుక అమరావతి ప్రాంతంలో టిడిపికి గతం కంటే ఇమేజ్ బాగా పెరిగింది.కానీ అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టిడిపి పై వ్యతిరేకత బాగా పెరిగింది అనే విషయంపై నిఘా రిపోర్ట్స్ జగన్ కు అందాయి.

ఇప్పుడు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి ఎదురుదాడి మొదలవుతుందని, అప్పుడు మరింతగా ఆ పార్టీ పరిస్థితి దిగజారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు

Jagan Play The Political Game With Tdp Chief Chandrababu Naidu-ap Cm Jagan Mohan Reddy,jagan,tdp Ministers Related....