మంత్రులకు నేరుగా వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్  

మంత్రులకి వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. .

Jagan Planing To Target 2024 Elections Also-

ఏపీలో తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా తనదైన పంథాలో దూసుకుపోతున్నారు.తను హామీ ఇచ్చిన నవరత్నాలను వరుసగా అమలు చేసుకుంటూ, మరోవైపు ఇచ్చిన హామీల మేరకు వాటిని కూడా రాజ్యాంగ బద్ధం చేసి, అందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా చాలా వరకు తన టీం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు..

Jagan Planing To Target 2024 Elections Also--Jagan Planing To Target 2024 Elections Also-

ఇప్పటికే దానికోసం కొంతమందికి పదోన్నతులు కల్పించడం, మరికొందరిని బదిలీలు చేయడం జరిగింది.ఇక మంత్రివర్గ ఏర్పాటు కూడా జగన్ చేసేసాడు.మంత్రివర్గ ఏర్పాటు తర్వాత పార్టీ మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

పరిపాలన పరంగా మంత్రులు ఎవరికి వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చిన తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించడం జరుగుతుందని గట్టి హెచ్చరికలు చేసినట్లు సమాచారం.జగన్ మొదటి నుంచి చెబుతున్నట్లు పారదర్శకత అందించే పరిపాలన తన ప్రభుత్వ హయాంలో ఉండాలనే ఆలోచనతో పాటు ఉ భవిష్యత్తు రాజకీయాలు దృష్టిలో ఉంచుకొని పని చేస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు, అత్యుత్తమ పరిపాలనతో ప్రజలకు చేరువై రానున్న 2024 ఎన్నికల్లో కూడా తిరిగి తనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.ఇక అదే జరిగితే ఏపీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట