జ‌గ‌న్ నోట ఎన్టీఆర్ మాట‌.. బాబుకు పెద్ద మైన‌స్‌

త‌న నిర్ణ‌యాల‌తో సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్!! ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎంపీల‌తో రాజీనామా నుంచి ఆయ‌న వేస్తున్న ఒక్కో అడుగు.టీడీపీ అధినేత‌కు ఇబ్బం దులు క‌లిగిస్తూనే ఉంది.

 Jagan Padayatra Nimmakuru Ntr Dialogue-TeluguStop.com

త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే అటు టీడీపీ నేత‌ల‌కు, ఇటు విశ్లేష‌కుల‌కు షాకులు మీద షాకులు ఇస్తూనే ఉన్నారు.ఎప్పుడు ఏ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ఎదురుచూస్తున్న వారంతా ఆశ్చ‌ర్యపోయే ప్ర‌క‌ట‌న చేశారు జ‌గ‌న్‌.

ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మారుస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదంటు న్నారు విశ్లేష‌కులు.విశ్వ‌విఖ్యాత‌, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెడ‌తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఇది జ‌గ‌న్‌కు పాజిటివ్‌నెస్ మ‌రింత పెంచేదే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్.సీఎం చంద్ర‌బాబు అవినీతిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ ముందుకు వెళుతున్నారు.

ఈ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది.ప్రాంతాల‌కు అనుగుణంగా హామీలు గుప్పిస్తూ.

అక్క‌డి నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌గ‌న్‌.ప్ర‌స్తుతం చంద్ర‌బాబుపై తిరుగులేని రామ‌బాణాన్ని ఎక్కుపెట్టారు వైసీపీ అధినేత‌.

ఎన్టీఆర్ సొంత గ్రామ ప్ర‌జ‌ల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులను ఆక‌ట్టుకునే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.తెలుగుదేశం పార్టీని, వ్యక్తి గతంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.

కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్.వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచ‌ల‌నం.పేద‌వాడికి అండ‌గా ఉంటూ.వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు.అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే చంద్ర‌బాబు వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు అక్క‌డ‌క్క‌డా వినిపిస్తూనే ఉంటాయి.

చంద్ర‌బాబు కూడా ప్ర‌తి ప‌థ‌కానికీ ముందు త‌న పేరు త‌గిలించుకుని, ఎన్టీఆర్ బొమ్మ క‌నిపించ‌కుండా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.పార్టీలో ఎన్టీఆర్ పేరు వినిపించ‌కుండా.

అంతా చంద్ర‌బాబే అన్నంత‌గా చేస్తున్నార‌నే అభిప్రాయాలు చాలా మందిలో ఎక్క‌డో గూడుక ట్టు కుపోయింది.ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.

ఎన్టీఆర్ పేరు ప్ర‌స్తావించ‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కమాన‌దు.క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న‌కృష్ణా జిల్లాలో.

ఆ వర్గం వారిని త‌న వైపు తిప్పుకునేందుకు.ఇదొక బ్ర‌హ్మాస్త్రంలా ప‌ని చేస్తుంద‌ని.

విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జగన్ సంచలన ప్రకటనతో టీడీపీ నేతలతో పాటు చంద్ర‌బాబు కూడా ఇబ్బందుల్లో పడినట్లేన‌ని వివ‌రిస్తున్నారు.

నిమ్మకూరు స్వర్గీయ ఎన్టీ రామారవు సొంతగ్రామం.ఈ గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకున్నారు.

ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కొందరు జగన్ ను కలవడం కూడా చర్చనీయాంశమైంది.జగన్ ప్రకటనతో నిమ్మకూరు గ్రామస్థులు హర్షం వ్య‌క్తంచేస్తున్నారు.

రాజ‌కీయంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం చాలా వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుంద‌ని నేత‌లు ఆశాభావంతో ఉన్నారు.ఇన్నాళ్లూ చంద్ర‌బాబుకు రాని ఆలోచ‌న జ‌గ‌న్‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఫ‌లితంగా చంద్ర‌బాబుకు ఇది పూర్తి మైన‌స్‌గా మారే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube