జగన్ సర్కార్ మరో నిర్ణయం...మాజీ లకు గన్ మెన్ ల కుదింపు  

Jagan One More Decision, Remove Ex Ministers Gunmens-

ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత నిదానంగా ఒక్కొక్క అంశంపై దృష్టి పెడుతూ ఒక్కొక్కటిగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు కు కల్పించిన భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే.

Jagan One More Decision, Remove Ex Ministers Gunmens--Jagan One More Decision Remove Ex Ministers Gunmens-

చంద్రబాబుకు కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీలో కూడా కుదింపులు చేసిన జగన్ సర్కార్ బాబు కాన్వాయ్‌లో రెండు వాహనాల్ని తగ్గించింది కూడా.అయితే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలకు కూడా ఏపీ సర్కార్ మంచి ఝలక్ ఇచ్చింది.

Jagan One More Decision, Remove Ex Ministers Gunmens--Jagan One More Decision Remove Ex Ministers Gunmens-

వారికి కేటాయించిన గన్ మెన్ లను కుదించాలని నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించి గతరాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో మంత్రులకు షిప్టుకు ఇద్దరేసి చొప్పున నలుగురు గన్ మెన్లతో సెక్యూరిటీ ఉండేది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇలాగే సెక్యూరిటీ కొనసాగింది.అయితే ఇప్పుడు తాజాగా ఆ గన్ మెన్ లను కుదించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటూ ఉత్తరువులు జారీ చేసింది.

ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు పితాని, జవహర్ లకు ఉన్న భద్రతను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది.గతంలో ఎక్సైజ్ శాఖలో పని చేసిన తాను, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నందున ప్రాణహాని ఉందని, భద్రత కొనసాగించాలని జవహర్ కోరినట్టు సమాచారం.

ఆయన వినతిని పోలీసు అధికారులు పట్టించుకోలేదని సమచారాం.

మరోవైపు కొందరు నేతలు ఓట్ల లెక్కింపు పూర్తికాగానే తమ గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు.ప్రభుత్వ భద్రత తమకు అక్కర్లేదని మాగంటి బాబు, బడేటి బుజ్జిలు రెండు వారాల క్రితమే గన్ మెన్ లను తిప్పి పంపారు.ఎవరైనా తమకు భద్రత అవసరమని భావిస్తే, దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో మాజీ సి ఎం బాబు కు జరిగిన అవమానం పై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లకు గన్ మెన్ లను కుదించడం పై ఇక వారు ఎలా స్పందిస్తారో చూడాలి.