ఏపీ క్యాబినెట్ విస్తరణ ? కొత్త పేర్లు ఇవే ?

ఏపీ క్యాబినెట్ విస్తరించేందుకు , సమూల ప్రక్షాళన చేసేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.  ఈ మేరకు మార్పుచేర్పులు ఏవిధంగా చేయాలి అనే విషయంపై జగన్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు.

 Jagan On The Idea Of A New Cabinet-TeluguStop.com

పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో జగన్ తన క్యాబినెట్ పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం నేతలతోనూ , తనకు వీర విధేయులైన వారితో నింపుతారు అని అందరూ అభిప్రాయపడగా,  దానికి భిన్నంగా సామాజిక వర్గాల సమ తూకం కే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు.ఎప్పుడూ లేని విధంగా తన క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలని జగన్ నియమించారు.

అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఉండే విధంగా కేబినెట్ లో బెర్త్ లు కేటాయించారు.అయితే ఆ మంత్రిపదవులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని,  ఆ తరువాత దాదాపు 90 శాతం మందిని తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తామని పదవులు ఇచ్చిన సమయంలో జగన్ చెప్పారు.

 Jagan On The Idea Of A New Cabinet-ఏపీ క్యాబినెట్ విస్తరణ కొత్త పేర్లు ఇవే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఆ సమయం రావడంతో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపై పూర్తిగా జగన్ దృష్టి సారించారు.

మొదటి విడత మంత్రివర్గం లో తీసుకుందామని చూసినా జగన్ సన్నిహితులకు అవకాశం దక్కలేదు .అందుకే ఇప్పుడు అవకాశం కల్పించాలని, ముఖ్యంగా టీడీపీని సమర్థవంతంగా తోప్పికొడుతూ పార్టీకి ప్రభుత్వానికి మేలు చేసే వారికి కొత్త క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని జగన్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.ప్రస్తుత మంత్రులలో సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుష్ప శ్రీవాణి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు వంటి వారి పదవులకు ఏ డొఖా లేదట.

Telugu Ap Cabinet, Ap Cm Jagan, Ap Government, Ap Politics, Chandrababu, Jagan, Jagan New Cabinet, Ministers, Mlas, Reddy Caste, Tdp, Ycp Goverment, Ycp New Ministers List, Ysrcp-Telugu Political News

అలాగే మంత్రివర్గంలో స్థానం సంపాదించుకునే వారి పేర్లు ఇవే అంటూ ఇప్పుడు హడావుడి మొదలైంది.శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వై వి సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉష శ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులకు మంత్రి పదవి దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

#Jagan #Reddy Caste #Chandrababu #AP Cabinet #Ycp Goverment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు