వివాదంలో జగన్ ప్రమాణస్వీకారం ?

గత టీడీపీ ప్రభుత్వం అనేక దుబారా ఖర్చులు పాల్పడిందని, లెక్కల మిక్కిలిగా రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచే విధంగా ఖర్చుపెట్టి ఎన్నో అక్రమాలకు పాల్పడింది అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అనేక విమర్శలు చేసింది.లోకేష్, చంద్రబాబు ను టార్గెట్ గా చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.

 Jagan Swearing In Controversy-TeluguStop.com

గత టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన అన్ని వివరాలను బయట పెట్టి మరి వైసీపీ నాయకులు విమర్శలు చేశారు.కానీ వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ఖజానాను పొదుపు చేస్తున్నారని, ఎక్కడ దుబారాకుు వెళ్లడం లేదని, ప్రతి విషయంలోనూ ఖర్చులు ఆదా చేస్తూ ఆదర్శప్రాయంగా ఉంటున్నారని వైసీపీ కాస్త గట్టిగానే చెప్పుకుంది.

ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే, తాజాగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేేసిన వ్యవహారంపై టిడిపి నేతలు విమర్శలు మొదలుపెట్టారు.జగన్ ప్రమాణస్వీకారం చేసి అప్పుడే ఏడాది దాటిపోయింది.

అప్పట్లో ప్రమాణస్వీకారం ఖర్చు మొత్తం 29 లక్షలు మాత్రమే ఉంటూ వైసీపీ గొప్పగానే చెప్పుకునిి ప్రచారం చేసుకుంది.కానీ గొప్పకోసం అలా చెప్పుకున్నారని, ఖర్చు మాత్రం కోట్ల రూపాయలు అయింది అంటూ కొన్ని రకాల ఆధారాలతో సహా టిడిపి వైసీపీ ప్రభుత్వం పై ఎదురుదాడి మొదలుపెట్టింది.

వివాదంలో జగన్ ప్రమాణస్వీకారం

ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వం పై ఆధారాలతో సహా విమర్శలు చేశారు.డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేశారు అంటే, ఇదే రాజుల సొమ్ము రాళ్ళ పాలు.ఏపీ ప్రజల సొమ్ము సీఎం నేలపాలు చేశారంటూ లోకేష్ ట్వీట్ చేశారు.సీఎం ఒక మీటింగ్ లో తాగిన వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్లు ఖరీదు అక్షరాల 43.44 లక్షలు. ఒక్క రోజులు ఇంత తాగారు అంటే, అది అమృతమైన అయి ఉండాలి లేదంటే ఏమైనా అయి ఉండాలి అంటూ విమర్శలు చేశారు.ఏడాది క్రితం ప్రమాణస్వీకారం రోజున వాటర్ బాటిల్స్ స్నాక్స్ కి రూ.59.49 లక్షలు బిల్లు అయిదంట.చిన్నవి స్నాక్స్ ? కరెన్సీ నోట్లా జగన్ రెడ్డి గారు అంటూ లోకేష్ విమర్శలు చేశారు.దీనికి సంబంధించిన ప్రభుత్వ జారీ చేసిన జీవోను కూడా ఆయన జతచేశారు.ఇక ఇదే విషయమై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సైతం ట్వీట్ చేశారు.

వివాదంలో జగన్ ప్రమాణస్వీకారం

వామ్మో ఈ దోపిడీ ఏంటి జగన్ గారు ? బాబు గారు తన సొంత ఖర్చులతో హిమాలయ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే గోలగోల చేశారు.ఇప్పుడు ప్రజాధనంతో మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నించారు.విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న జగన్ రెడ్డి వాటర్ బాటిల్ మజ్జిగ ప్యాకెట్లు కోసం రూ.43.44 లక్షలు స్వాహా చేశారు అంటూ విమర్శించారు.జగన్ గారి ప్రమాణ స్వీకారానికి డబ్బులు ఇప్పటికీ విడుదల చేస్తూనే ఉన్నారు.వాటర్ బాటిల్ స్నాక్స్ కోసం 59.49 లక్షలు స్వాహా చేశారు అంటూ ఆయన విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube