ఎన్నార్సీ బిల్లు విషయంలో బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన జగన్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్నార్సీ బిల్లులకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.అయితే ఇప్పటికే పౌరసత్వ సవరణ బిల్లుని లోక్ సభలో ఆమోదించిన ప్రభుత్వం దానిని దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నాయి.

 Jagan Nrc Bjp Paurusatwa Billu Ysrcp-TeluguStop.com

ఈ బిల్లు ఇప్పుడు దేశంలో ఉన్న ఇతర వర్గాల వారికి పెద్దగా వ్యతిరేకం కాకపోయినా తరువాత మోడీ, అమిత్ షా టార్గెట్ లో భాగంగా తీసుకురానున్న ఎన్నార్సీ బిల్లుకి మాత్రం చాలా రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి.పౌరసత్వ సవరణ బిల్లుని అమలు చేసి, 1955 తర్వాత ఇండియాకి వలస వచ్చిన వారు `ఇండియన్స్ గా గుర్తించకుండా వారిని వలసదారులు క్రింద గుర్తిస్తూ చేపట్టే చట్టం ఎన్నార్సీ.

దీనిని తీసుకొస్తే ఇండియాలో సెటిల్ అయిన ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకి చెందిన చాలా మంది ఇండియన్స్ పౌరసత్వం కోల్పోవాల్సి వస్తుంది.ఈ కారణంగా ఈ బిల్లుని ముస్లిం సంఘాలు ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నాయి.

అయితే కేంద్రం ప్రభుత్వమైనా బీజేపీ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని తాజా ఎన్నికలలో కొంత వరకు లబ్ది పొందిన జగన్ ఇన్ని రోజులు బీజేపీకి, మోడీకి విశ్వాసపాత్రుడు క్రింద ఉంటూ వచ్చారు.బీజేపీ పార్టీతో సన్నిహితంగా ఉంటూ ఏపీలో నవరత్నాలు అమలు చేయడానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడంతో పాటు, తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచించినట్లు రాజకీయ వర్గాలలో వినిపించింది.

అయితే ఊహించని విధంగా తాజాగా ఎన్నార్సీ విషయంలో జగన్ బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్నా ఎన్నార్సీ బిల్లుని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదనే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో స్పష్టం చేశారు.

అయితే సిటిజన్ షిప్ బిల్లుకి పార్లమెంటులో మద్దతు ఇచ్చిన జగన్ ఉన్నపళంగా ఇలా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడానికి తనకున్న బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీ ఓటింగ్ కారణం అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube