పిలుపు వచ్చినా పలకరించరేమి ? జగన్ కే ఎందుకు ఇలా ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్రం దోబూచులాట ఆడుతోంది.ఎన్నికల ముందు వరకు జగన్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన బిజెపి ఇప్పుడు మాత్రం మొహం చాటే స్తోంది.

 Jagan Not To Get The Modi And Amith Shah Appointment-TeluguStop.com

కొద్ది రోజులుగా ఏపీలో బిజెపి బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది.అధికార వైసీపీ పై విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది.

అయితే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో పాటు తాము సన్నిహితంగా మెలగాలి అనే భావనతో వైసీపీ పెద్దగా ఎదురుదాడి చేయలేకపోతోంది.

Telugu Bjpnarendra, Jagan, Jaganmodi, Modimeet, Sapurammp-

ఇక ఈ విషయం పక్కన పెడితే జగన్ విషయంలో కేంద్ర బిజెపి పెద్దల తీరు ఎవరికీ అంతుబట్టడం లేదు.ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు.వారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత జగన్ వెళ్లి కలిసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అపాయింట్మెంట్ రద్దయ్యింది అంటూ కబురు పంపుతున్నారు.

మళ్లీ అపాయింట్మెంట్ దొరుకుతుందా అంటే అది చెప్పలేం.

Telugu Bjpnarendra, Jagan, Jaganmodi, Modimeet, Sapurammp-

ఇలా ఇప్పటికే అనేక సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లడం, వెనక్కి తిరిగి రావడం షరా మామూలైపోయింది.అసలు జగన్ ఏ విషయం మీద తమని కలవాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటున్న కేంద్ర పెద్దలు జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేస్తున్నారు.వాస్తవంగా ప్రధాని మోదీ, అమిత్ షా లు ఇద్దరూ చాలా బిజీగా ఉండే నాయకులు.

సభలు, సమావేశాలు, పర్యటనలు ఇలా నిత్యం బిజీగానే ఉంటారు.అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు ఎటువంటి సమావేశాలు, పర్యటనలు పెట్టుకోకుండా ఢిల్లీలో అందుబాటులోనే ఉంటారు.

వారిని కలవాలనుకునేవారు ఇదే సరైన సమయంగా భావిస్తూ వారిని కలుస్తూ ఉంటారు.ఇప్పటికే అనేకమంది వైసీపీ ఎంపీలు మోదీని, అమిత్ షాను కలిశారు.

Telugu Bjpnarendra, Jagan, Jaganmodi, Modimeet, Sapurammp-

ఇక వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం మోదీతో కానీ, అమిత్ షా తో కానీ కలుస్తూనే ఉంటున్నారు.కానీ అవకాశం జగన్ కు మాత్రం దక్కడం లేదు.ప్రస్తుతానికి జగన్ కు కేంద్రం పెద్దలతో వ్యక్తిగత సంబంధాలు లేవు.ఆయన వారిని కలవాలన్నా ఏపీ కి సంబంధించిన సమస్యల గురించి, నిధుల విడుదల గురించి మాత్రమే కలవాలి.

అయితే జగన్ తన వ్యక్తిగత విషయాలు, ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు తమపై దూకుడు పెంచడం తదితర విషయాల మీద ఫిర్యాదులు చేసేందుకు జగన్ వస్తున్నారన్న సమాచారం బీజేపీ పెద్దలకు ముందుగానే ఉంటోంది.దీంతో వారు జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది.

ఇక వైసీపీతో తమకు సంబంధం లేదు అనే విషయాన్ని నేరుగా చెప్పకుండా, ఈ విధంగా సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు కూడా అందరికీ కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube