ఆ 60 వేల మంది కాపులకు షాకిచ్చిన జగన్‌!

పేరు గొప్ప.ఊరు దిబ్బ అంటే ఇదే.

 Jagan Not Mentioned On Kapu Budjet In Ap Assembly-TeluguStop.com

అసలే అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న సమయంలో ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చారు.ఆయన వచ్చిన తర్వాత ఉన్నది కూడా పంచి పెట్టడం తప్ప కొత్తగా సంపద సృష్టించింది లేదు.

దీంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.ఇప్పటికే భారీగా అప్పులు చేయడంతో కొత్తగా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

Telugu Apcm, Apkapu, Ap Kapu Budjet, Jagan, Jagan Kapu, Jagankapu-

ఇలాంటి సమయంలోనూ తాను గతంలో చంద్రబాబు ప్రభుత్వం కంటే ఎక్కువే చేస్తున్నానని చెప్పుకోవడానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.అందులో కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు.ప్రతి ఏటా ఇలాగే ఇస్తామనీ గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.

కానీ ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ మొదలైనా ఇప్పటి వరకూ కాపు లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా అందలేదు.

Telugu Apcm, Apkapu, Ap Kapu Budjet, Jagan, Jagan Kapu, Jagankapu-

నోటిమాటగా కేటాయింపులైతే జరిగాయి కానీ.ఆ లబ్ధి మాత్రం వాళ్లకు చేకూరలేదు.చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్లు కేటాయించే వారు.

ఈ డబ్బును ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజికవర్గంలోని పేదల స్వయం ఉపాధి కోసం ఖర్చు చేసే వాళ్లు.జగన్‌ వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారే తప్ప.

ఇప్పటి వరకూ పైసా విదిల్చలేదు.

గత ప్రభుత్వం సుమారు 60 వేల మంది కాపు లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం రాయితీలు అందించేది.

జగన్‌ వచ్చిన తర్వాత ఆ లబ్ధిదారుల జాబితాను కూడా రద్దు చేశారు.కొత్తగా ఎంపిక చేస్తామని చెప్పారు.

ఇంతవరకూ ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు.దీంతో కాపుల స్వయం ఉపాధి పథకం ప్రశ్నార్థకమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube