మీడియా ఏం చేసిందో ? జగన్ ఎందుకు దూరం పెడుతున్నారో ?  

jagan not intrested on press meets Jagan, Chandrababu, Ap, Media, BJP, TDP, Ap Capital, Amaravathi, - Telugu Amaravathi, Ap, Bjp, Chandrababu, Government, Jagan, Media, Ministers, Party, Telugudesam

ఏపీ సీఎం జగన్ మనస్తత్వం ఏమిటో ఇప్పటికీ ఆయన సన్నిహితులకు సైతం సరిగా అర్థమే కాదు.ఎప్పుడు ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ అంతుపట్టదు.

TeluguStop.com - Jagan Not Intrested On Press Meets

జగన్ వ్యవహారశైలి ముందు నుంచి ఇదే విధంగా ఉన్నా, రాజకీయంగా అత్యున్నతమైన పదవిలో ఉండడంతో, అందరి దృష్టి సహజంగానే ఆయన వ్యవహారాలపై పడుతుంది.ఆయనకు సంబంధించిన ప్రతి విషయంపైనా, ఆసక్తి నెలకొంటుంది.

అయితే పరిపాలనా పరిపాలన పరంగా కానీ, మిగతా విషయాల్లో కానీ, జగన్ అభిప్రాయం ఏమిటో అది అమలయ్యే వరకు ఎవరికి తెలియదు.వ్యక్తిగత అంశమైన, ప్రభుత్వానికి సంబంధించిన విషయమైనా, ఏ విషయంలోనూ జగన్ తరఫున ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరో ఒకరు స్పందిస్తూ ఉంటారు తప్ప, జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడరు.

TeluguStop.com - మీడియా ఏం చేసిందో జగన్ ఎందుకు దూరం పెడుతున్నారో -General-Telugu-Telugu Tollywood Photo Image

వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒకసారి జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.అదికూడా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడంతో జగన్ మీడియా సమావేశం నిర్వహించి, నిమ్మగడ్డ పక్షపాత వైఖరిని ఎత్తి చూపించి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.

ఇక ఆ తర్వాత ఏపీలో ఎన్నో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి.కరోనా సమయంలోనూ, అంతకుముందు కూడా రికార్డ్ చేసిన వీడియో ని కానీ, తన నిర్ణయాలను ప్రెస్ నోట్ రూపంలో కానీ, పార్టీలోని నాయకులు, ప్రభుత్వంలోని కీలక అధికారుల ద్వారానే జగన్ చెప్పిస్తూ వస్తున్నారు.

కానీ ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అదేపనిగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.చివరకు కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలోనూ, ఆన్లైన్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా బాబు ప్రయత్నించారు.

కానీ జగన్ మాత్రం మీడియాను దూరం పెడుతున్నట్టు గానే వస్తున్నారు.రాష్ట్రంలో రాజధాని అంశం తో పాటు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అంతర్వేదిలో రథం దగ్ధం, తిరుమల డిక్లరేషన్, కేంద్ర బిజెపి పెద్దలతో భేటీ అవ్వడం ఎలా ఎన్నో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ విషయంలో జగన్ మీడియా ముందుకు రావడం గానీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై స్పందించడం కాని చేయడం లేదు.

పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలో జగన్ పాలన చేసుకుంటూ వెళుతున్నారు.

రాష్ట్రంలో ఎంత పెద్ద సంచలనం చోటు చేసుకున్నా, జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోవడంతో, అసలు ఆయన అంతరంగం ఏమిటో మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆ పార్టీలోని కీలక నాయకులకు సైతం అంతు పట్టడం లేదు.తాను అనుకున్న పని, అనుకున్నట్టుగా చేసుకు వెళ్ళిపోవడమే తప్ప, తాను ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు అన్నట్లు గానే జగన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

#Media #Chandrababu #Party #Amaravathi #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Not Intrested On Press Meets Related Telugu News,Photos/Pics,Images..