సోనియా ఆహ్వానంని కాదు పొమ్మన్న జగన్! ఇక కాంగ్రెస్ కి దూరం అయినట్లేనా

దేశ వ్యాప్తంగా ఇప్పుడు విపక్షాలన్నీ మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నాయి.అదే సమయంలో మోడీ మీద ప్రాంతీయ పార్టీలకి ఉన్న వ్యతిరేకతని తనకి అనుకూలంగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.

 Jagan Not Interested To Attend All Parties Meeting Opposite To Modi-TeluguStop.com

దీని కోసం కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యూహాలని సిద్ధం చేసి ప్రాంతీయ పార్టీలతో విపక్షాల బేటీ ఏర్పాటు చేసింది.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విపక్షాల బేటీలో కీలకంగా మారి కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతీయ పార్టీలు అన్నింటిని దగ్గర చేస్తున్నాడు.

మోడీని గద్దె దించడానికి తన రాజకీయ చతురతకి పదును పెడుతున్నాడు.

అయితే ఏపీలో వైసీపీ మద్దతు కూడా తనకి ఉపయోగపడేలా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ, వైసీపీకి కూడా ఆహ్వానం పంపించింది.

ఇదే సమయంలో వైఎస్ ఫ్యాక్టర్ ని ఉపయోగించి మళ్ళీ జగన్ ని తన దారిలో తెచ్చుకోవచ్చని కాంగ్రెస్ ఎత్తుగడగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అయితే కాంగ్రెస్ ఆహ్వానాన్ని వైసీపీ అధినేత జగన్ తిరస్కరించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం బీజేపీకి దగ్గరైన వైసీపీ, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.జగన్ నిర్ణయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది అని రాజకీయ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube