జగన్ అలా ఎందుకు చేశాడు ? మాట తప్పినట్టేనా ?  

Jagan No Chance To Given Ministrie In Nagari Mla Roja And Others-

కొత్త ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి మండలిని దాదాపు ఫైనల్ చేసేశాడు.మొదటి నుంచి మంత్రి పదవి ఫలానా వారికి ఖాయం అనుకున్న వారెవరికీ ఇందులో చోటు దక్కలేదు.అంతే కాదు ఎన్నికల ప్రచారంలో ఈయన్ను మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాను అంటూ వాగ్దానం చేసినవారికి కూడా ఇందులో అవకాశం దక్కలేదు...

Jagan No Chance To Given Ministrie In Nagari Mla Roja And Others--Jagan No Chance To Given Ministrie In Nagari Mla Roja And Others-

ఇక మరికొందరైతే వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటే నడిచినవారు ఉన్నారు.అధికార పార్టీ వేధింపులు సైతం తట్టుకుని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినవారు.వీరంతా ప్రభుత్వం రావడంతో తమకు మంత్రి పదవులు గ్యారంటీ అని భావించారు.

వారి వారి అనుచరులైతే కాబోయే మంత్రి అంటూ నినాదాలు కూడా చేసేసారు.సీన్ కట్ చేస్తే జగన్ మంత్రివర్గంలో ఊహించినవారికంటే ఎవరూ ఊహించని వారికే మంత్రి పదవులు దక్కాయి.

Jagan No Chance To Given Ministrie In Nagari Mla Roja And Others--Jagan No Chance To Given Ministrie In Nagari Mla Roja And Others-

జగన్ మంత్రి వర్గంలో ఎవరికి మంత్రి పదవి దక్కినా దక్కకపోయినా నగరి ఎమ్యెల్యే రోజాకు కీలకమైన మంత్రి పదవి ఖాయం అని అంతా భావించారు.

ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో పోరాడారు.అసెంబ్లీలో సస్పెన్షన్లను ఎదుర్కొన్నారు.టీడీపీ నాయకులనే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ని కూడా వ్యక్తిగత స్థాయిలో దూషణలను విమర్శలుగా చేసి కలకలం సృష్టించారు.

ఇటువంటి పరిస్థితుల్లో రోజాకు మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు.కానీ జగన్ మాత్రం ఆమెను పరిగణనలోకి తీసుకోలేదు.ఇప్పుడు అన్ని శాఖలను భర్తీ చేసేసారు.

మరో రెండున్నరేళ్ల వరకూ ఆ అవకాశం లేదు.మరో నామినేటెడ్ పదవి ఏదైనా ఇచ్చినా అది రోజా స్థాయికి తక్కువే.

ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలుకలూరిపేట టిక్కెట్ త్యాగం చేసిన మర్రి రాజశేఖర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.ఇందులో జగన్ బంధువు బాలినేనికి.

బెర్త్ దొరికింది.కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌లకు మాత్రం అవకాశం దక్కలేదు.వైసీపీలో చాలామందే రాజకీయ సీనియర్లు ఉన్నారు...

అటువంటి వారిలో ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు.ధర్మాన సోదరులు ఇద్దరూ గెలిచారు.దీంట్లో మొదటి నుంచి తనతో పాటు నడిచిన ధర్మాన కృష్ణదాస్‌కు జగన్ అవకాశం కల్పించారు.

ప్రసాదరావును పక్కన పెట్టారు.ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన రేపల్లె, మండపేట నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.మొత్తంగా చూస్తే విధేయతకే జగన్ పట్టం కట్టినట్టుగా కనిపించినా కొన్ని చోట్ల మాత్రం ఎవరూ ఊహించనివారు పదవులు దక్కించుకున్నారు.